Delhi Elections : ఢిల్లీ (Delhi) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) పోలింగ్ (Polling) ముగిసింది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ఢిల్లీ వ్యాప్తంగా మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడత (Single Phase) లో పోలింగ్ నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసినా అప్పటికే క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.
సాయంత్రం 5 గంటల వరకు ఢిల్లీలో రికార్డు స్థాయిలో 57.7 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. పూర్తి పోలింగ్ శాతం ఎంత అనేది వెల్లడి కావడానికి మరికొన్ని గంటల సమయం పడుతుందని పేర్కొంది. కాగా ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో గెలుపు కోసం 13 వందల పైచిలుకు అభ్యర్థులు బరిలో నిలిచారు. ఢిల్లీలోని 1.56 కోట్ల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఈ నెల 8న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.
#WATCH | Polling officials seal EVM and VVPAT on the conclusion of voting in Delhi Assembly elections; Visuals from Wazirabad pic.twitter.com/hO2kMz8IDJ
— ANI (@ANI) February 5, 2025
#WATCH | EVM and VVPAT being sealed as polling concludes in Delhi Assembly elections; Visuals from polling station-68, Raghubir Singh Junior Modern School, Humayun Road pic.twitter.com/Du8NYFq5V7
— ANI (@ANI) February 5, 2025
Mallikarjun Kharge | ‘నేను నీ అయ్య సహచరుడిని.. నోరు మూసుకుని కూర్చో..’ బీజేపీ ఎంపీపై ఖర్గే అసహనం
Land grabbing | కబ్జా కోరల్లో రూ.300 కోట్ల ప్రభుత్వ స్థలం.. పట్టించుకోని అధికారులు
Donald Trump | గాజా స్ట్రిప్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన..!
Auto driver | నటుడు విజయ్ పార్టీలో ఆటో డ్రైవర్‌కు కీలక పదవి
Rahul Gandhi | ఢిల్లీలో అతిపెద్ద కుంభకోణం చేసిందెవరు..? : రాహుల్‌గాంధీ
Gold price | అమెరికా, చైనా ట్రేడ్ వార్ ఎఫెక్ట్.. భగ్గుమంటున్న బంగారం ధరలు