Mallikarjun Kharge : కాంగ్రెస్ పార్టీ (Congress Party) జాతీయాధ్యక్షుడు (National President) మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) రాజ్యసభ (Rajya Sabha) లో సహనం కోల్పోయారు. రాష్ట్రపతి ప్రసంగాని (President speech) కి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఖర్గే గత సోమవారం రాజ్యసభలో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత మాజీ ప్రధాని (Former Prime Minister) చంద్రశేఖర్ (Chandra Shekar) తనయుడు, బీజేపీ ఎంపీ (BJP MP) నీరజ్ శేఖర్ (Neeraj Shekar) తన ప్రసంగానికి అడ్డు తగలడంతో ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ భారీగా పతనమవుతోందని, కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలే ఇందుకు కారణమని ఖర్గే ఆరోపిస్తుండగా.. బీజేపీ ఎంపీ నీరజ్ శేఖర్ అడ్డుతగిలారు. దాంతో సహనం కోల్పోయిన ఖర్గే.. ‘తేరా బాప్ కా భీ మెయిన్ ఐసా సాథీ థా. తూ క్యా బాత్ కర్తా హై..? తుజ్కో లేకర్ ఘుమా. చుప్, చుప్, చుప్ బైట్ (నేను నీ అయ్యకు సహచరుడిని. ఏం మాట్లాడుతున్నవ్..? నీ సంగతి చెప్తా. నోర్ముయ్, నోర్ముయ్, నోరు మూసుకొని కూర్చో) అని వ్యాఖ్యానించాడు.
ఖర్గే వ్యాఖ్యలు సభలో తీవ్ర దుమారం రేపాయి. దాంతో ఛైర్మన్ జగదీప్ ధన్కడ్ కలుగజేసుకుని అధికార, ప్రతిపక్ష ఎంపీలను శాంతింపజేశారు. ‘చంద్రశేఖర్ దేశంలోని గొప్ప నాయకుల్లో ఒకరు. ఆయనకున్న గౌరవం అమూల్యమైనది. ఆయన గురించి అగౌరవంగా మాట్లాడినందున ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి’ అని ఖర్గేను కోరారు. చంద్రశేఖర్, తాను కలిసి అరెస్టయ్యామని, అందుకే ఆయన తన సమకాలికుడని చెప్పానని ఖర్గే బదులిచ్చారు.
దాంతో ఛైర్మన్ స్పందిస్తూ.. ‘కానీ మీరు ‘నీ అయ్య’ అనే పదం వాడారు. అలా మాట్లాడొచ్చా..? సాటి గౌరవ సభ్యుడితో మీరు నీ అయ్య అని వ్యాఖ్యానించారు. చంద్రశేఖర్ గారిని మనం గౌరవించాలి. కాబట్టి మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి’ అని ఛైర్మన్ ధన్‌కఢ్ మరోసారి ఖర్గేను కోరారు. కానీ ఖర్గే అందుకు ఒప్పుకోలేదు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి బీజేపీ సభ్యులు అగౌరవంగా మాట్లాడిన సందర్భాలను గుర్తుచేశారు.
‘మన్మోహన్ సింగ్ స్నానం చేసేటప్పుడు కూడా రెయిన్ కోట్ వేసుకుంటారని ఒకరు అవమానించారు. ఒకరు ఆయన మాట్లాడనే మాట్లాడరని హేళన చేశారు. కొందరు ఆయనకు ప్రభుత్వాన్ని నడపడం చేతగాదని కించపర్చారు. వాళ్లు ఇంత అవమానించినా ఆయన సహించారు. దేశ ప్రయోజనాల కోసం మౌనంగా భరించారు. అందుకు కూడా ఆయనను మౌని బాబా అంటూ అగౌరవపర్చారు. ఇలా సాటి వ్యక్తులను అగౌరవపర్చే తత్వం వాళ్లది. మేం అవమానాలను సహించే వాళ్లం. చంద్రశేఖర్‌ను అవమానించే ఉద్దేశంతో నేను ఆ మాట అనలేదు’ అని ఛైర్మన్ ధన్‌కఢ్‌కు ఖర్గే బదులిచ్చారు.
Land grabbing | కబ్జా కోరల్లో రూ.300 కోట్ల ప్రభుత్వ స్థలం.. పట్టించుకోని అధికారులు
Donald Trump | గాజా స్ట్రిప్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన..!
Auto driver | నటుడు విజయ్ పార్టీలో ఆటో డ్రైవర్‌కు కీలక పదవి
Rahul Gandhi | ఢిల్లీలో అతిపెద్ద కుంభకోణం చేసిందెవరు..? : రాహుల్‌గాంధీ
Gold price | అమెరికా, చైనా ట్రేడ్ వార్ ఎఫెక్ట్.. భగ్గుమంటున్న బంగారం ధరలు