Jharkhand Elections | జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ (Jharkhand Elections) చివరి దశకు చేరింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకూ కొనసాగనుంది. దీంతో ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల వరకూ 59.28 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఎన్నికల సంఘం డేటా ప్రకారం.. సెరైకెల్లా – ఖర్సావాన్ నియోజకవర్గంలో అత్యధికంగా 66.38 శాతం పోలింగ్ నమోదైంది. రాజధాని రాంచీలో అత్యల్పంగా 53.40 శాతమే ఓటింగ్ నమోదైంది. లోహర్దగాలో 65.99 శాతం, సిమ్డెగాలో 64.31 శాతం, పాలము జిల్లాలో 56.57 శాతం, రామ్‌గఢ్‌లో 59.22 శాతం, ఖుంటిలో 63.35 శాతం, గుమ్లాలో 64.59 శాతం, వెస్ట్ సింగ్బంలో 60.35 శాతం, లతేహర్‌లో 62.81 శాతం, గర్వాలో 61.06 శాతం, ఈస్ట్ సింగ్బంలో 58.72 శాతం, హజారీబాగ్‌లో 57.16 శాతం మేర పోలింగ్ నమోదైంది.
రాష్ట్రంలోని మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 43 స్థానాలకు తొలి విడతలో ఓటింగ్ జరిగింది. మొదటి దశలో 1.37 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 683 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వీరిలో 609 మంది పురుషులు, 73 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్‌జెండర్ ఉన్నారు.
గిరిపుత్రులు ఎటు వైపో?
2019 ఎన్నికల్లో ఈ 43 స్థానాల్లో 25 స్థానాలను జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి గెలుచుకోగా, బీజేపీ కేవలం 13 స్థానాలను, స్వతంత్రులు రెండు స్థానాలను, ఎన్సీపీ ఒక్క సీటును, జేవీఎం ఒక్క సీటును దక్కించుకున్నాయి. 43 నియోజవకర్గాల్లో 20 ఎస్టీ రిజర్వుడ్, ఆరు ఎస్సీ రిజర్వుడ్ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో వీటిల్లో 18 స్థానాలను కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ కూటమే దక్కించుకోగా, రెండింటిని మాత్రమే బీజేపీ గెలుచుకుంది. ఈసారి కూడా ఎస్టీ రిజర్వుడ్ స్థానాలపై ఇండియా కూటమి భారీగా ఆశలు పెట్టుకున్నది. ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ అరెస్టుపై సానుభూతి కలిసొస్తుందని భావిస్తున్నది. సొరేన్ సైతం ప్రధానంగా ఎస్టీల హక్కులనే ప్రస్తావిస్తూ ప్రచారం చేశారు. బీజేపీ కూడా గిరిజన ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నించింది.
Also Read..
MS Dhoni | మాజీ సారథికి హైకోర్టు నోటీసులు.. ఎందుకో తెలుసా..?
Eknath Shinde | సీఎం ఏక్నాథ్ షిండే, కేంద్ర మంత్రి అథవాలే బ్యాగ్‌లను చెక్ చేసిన ఎన్నికల అధికారులు
Rajasthan bride | పెళ్లి వేడుకలు జరుగుతుండగానే ఓటేసేందుకు వచ్చిన పెళ్లి కూతురు.. Video