Eknath Shinde | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharastra elections) వేళ ఆ రాష్ట్రంలో నేతల బ్యాగులు చెక్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం శివసేన (యూటీబీ) చీఫ్, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) బ్యాగ్‌ను అధికారులు తనిఖీ చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, అమిత్‌షా బ్యాగులను కూడా చెక్ చేశారా..? అంటూ ఎన్నికల అధికారులను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే (CM Eknath Shinde), కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే (Ramdas Athawale) బ్యాగులను ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు (bags were checked).
#WATCH | Maharashtra: CM Eknath Shinde’s bags were checked at Palghar Police ground helipad where he reached for the election campaign.
(Source: Shiv Sena) pic.twitter.com/r1OXCHTY4S
— ANI (@ANI) November 13, 2024
ఎన్నికల ప్రచారానికి వచ్చిన సీఎం ఏక్నాథ్ షిండే బ్యాగును అధికారులు పాల్ఘర్ పోలీస్ గ్రౌండ్ హెలిప్యాడ్ వద్ద తనిఖీ చేశారు. హెలికాప్టర్ ల్యాండ్ కాగానే అక్కడికి వెళ్లిన అధికారులు నిబంధనల ప్రకారం.. సీఎం వెంట తెచ్చుకున్న సూట్‌కేస్, ఇతర బ్యాగ్‌లను తనిఖీ చేశారు. అదే విధంగా కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే బ్యాగును కూడా అధికారులు చెక్ చేశారు. హెలికాప్టర్లో పూణెకి వచ్చిన కేంద్ర మంత్రి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్‌గా మారాయి.
#WATCH | Maharashtra: Union Minister Ramdas Athawale’s bags were checked at Pune by the officers of the Election Commission.
(Source: RPI) pic.twitter.com/mbfZ8ygRo1
— ANI (@ANI) November 13, 2024
కాగా, రెండు రోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు యావత్మాల్కు వెళ్లగా అధికారులు తన బ్యాగ్ తనిఖీ చేశారంటూ శివసేన (యూటీబీ) చీఫ్, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ, అమిత్‌షా బ్యాగులను కూడా చెక్ చేశారా..? అంటూ ప్రశ్నించారు. ‘నా బ్యాగులు చూసే ముందు మీరు ఏ రాజకీయ నేతల బ్యాగులను తనిఖీ చేశారు? ఏక్నాథ్ షిండే, ఫడ్నవీస్, అజిత్ పవార్, మోదీ, అమిత్ షా బ్యాగ్‌లను మీరు చెక్ చేశారా? మోడీ బ్యాగ్‌లను తనిఖీ చేసిన వీడియోను నాకు చూపించండి. నేను దీనిని వీడియో తీస్తున్నా’ అని అన్నారు.
ఠాక్రే వ్యాఖ్యలపై బీజేపీ తాజాగా స్పందించింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) బ్యాగ్‌ను కూడా చెక్ చేసినట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఠాక్రేకు కౌంటర్ ఇస్తూ ఓ వీడియోను కూడా విడుదల చేసింది. మరోవైపై ఠాక్రే విమర్శలపై కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ స్పందించిన విషయం తెలిసిందే. దేశంలోని అగ్ర రాజకీయ నేతలకు సంబంధించిన హెలికాప్టర్లలో కూడా సోదాలు చేస్తామని తెలిపారు. నిబంధనల ప్రకారమే ఠాక్రే బ్యాగ్‌ను పరిశీలించామన్నారు.
Also Read..
Devendra Fadnavis | ఫడ్నవీస్ బ్యాగ్‌ను కూడా చెక్ చేశారు.. వీడియోతో ఉద్ధవ్ ఠాక్రేకు బీజేపీ కౌంటర్
Earthquake | కశ్మీర్ లోయను వణికించిన భారీ భూకంపం
Droupadi Murmu | చిన్నారులతో కలిసి క్యారమ్స్ ఆడిన రాష్ట్రపతి ముర్ము.. వీడియో