Droupadi Murmu | నిత్యం అధికారిక కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉండే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఇవాళ పాఠశాల చిన్నారులతో (school childrens) సరదాగా గడిపారు. వారితో ఆటలు ఆడి తన విలువైన సమయాన్ని సరదాగా గడిపారు.
ముర్ము బుధవారం సిల్వాస్సా (Silvassa)లోని జండాచౌక్లో గల స్వామి వివేకానంద విద్యా మందిర్ (Swami Vivekananda Vidya Mandir)ను సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నారులతో సరదాగా ముచ్చటించారు. పిల్లల పేర్లు ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థితో ముర్ము.. క్యారమ్స్ ఆడారు. అనంతరం చిన్నారులతో ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
#WATCH | President Droupadi Murmu shares some light moments with school children during her visit to Swami Vivekananda Vidya Mandir, Zanda Chowk, Silvassa.
(Source: Rashtrapati Bhavan) pic.twitter.com/8Ave0sS6Yp
— ANI (@ANI) November 13, 2024
Also Read..
Earthquake | కశ్మీర్ లోయను వణికించిన భారీ భూకంపం
Iran: సీరియల్ రేపిస్టును బహిరంగంగా ఉరి తీశారు..
Laapataa Ladies | ఆస్కార్ కోసం పేరు మార్చుకున్న లాపతా లేడీస్..!