టెహ్రాన్: ఇరాన్(Iran)లో సీరియల్ రేపిస్టును బహిరంగంగా ఉరి తీశారు. గత రెండు దశాబ్ధాల్లో అతను డజన్ల సంఖ్యలో మహిళలను రేప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్టోబర్‌లో మొహమ్మద్ అలీ సలామత్కు ఇరాన్ సుప్రీంకోర్టు మరణశిక్షను కన్ఫర్మ్ చేసింది. హమేదాన్ నగరంలో ఉన్న ఓ శ్మశానవాటికలో అతన్ని మంగళవారం ఉరి తీశారు. సలామత్ తమను రేప్ చేసినట్లు సుమారు 200 మంది మహిళలు ఆరోపించారు. దేశంలో అత్యధిక సంఖ్యలో రేప్‌లకు పాల్పడిన వ్యక్తిగా అతను నిలిచాడు.