MS Dhoni : ఐపీఎల్ 18వ సీజన్ ఆడేందుకు సిద్ధమవుతున్నచెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni)కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పరవు నష్టం కేసులో వ్యక్తిగతంగా కోర్టులో హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఆర్కా స్పోర్ట్స్ (Aarka Sports) యజమాని మిహిర్ దివాకర్(Mihir Diwakar), సౌమ్యా విశ్వాస్ (Soumya Vishwas) మహీ భాయ్‌పై పరువు నష్టం దావా వేశారు. ఆ కేసును విచారించిన జార్ఖండ్ హైకోర్ట్ బుధవారం ధోనీకి నోటీసులు జారీ చేసింది.
ధోనీతో ఆర్కా స్పోర్ట్స్ (Aarka Sports) యజమాని మిహిర్ దివాకర్ క్రికెట్ అకాడమీ ఏర్పాటుకు గతంలో ఒప్పందం చేసుకున్నాడు. అయితే.. అగ్రిమెంట్‌ను కాలరాస్తూ ధోనీ తమపై తప్పుడు ఆరోపణలు చేశారని మిహిర్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. అంతేకాదు ధోనీ తమ పరువుకు భంగం కలిగించేలా ప్రకటనలు చేశారని ఆయన ఆరోపించాడు.
Ms dhoni pic.twitter.com/DQfri2SoKb
— RVCJ Sports (@RVCJ_Sports) November 13, 2024
ఈ మేరకు ధోనీ తమకు నష్ట పరిహారం చెల్లించాలని కోర్టును ఆశ్రయించాడు కూడా. అదేవిధంగా సోషల్ మీడియా, మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో తమకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు చేయకుండా నియంత్రించాలని కోర్టును అభ్యర్థించారు.
మిహిర్, సౌమ్యాలు క్రికెట్ అకాడమీ పెడతామని 2017లో ధోనీతో ఒప్పందం చేసుకున్నారు. ఫ్రాంచైజీ ఫీజుతో పాటు లాభాల్లో వాటా ఇస్తామని అగ్రిమెంట్ సమయంలో రాసుకున్నారు. కానీ, నిబంధనలను మిహిర్ దంపతులు తుంగలో తొక్కారు. దాంతో, తాను మోసపోయాననే విషయం గ్రహించిన ధోనీ రాంచీ కోర్టును ఆశ్రయించాడు.
క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేస్తామని తనతో ఒప్పందం కుదుర్చుకొని దానిని పాటించలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. రూ.15 కోట్ల మేర మోసం చేశారంటూ తెలిపాడు. దీంతో ఐపీసీ 406, 420 సెక్షన్ల కింద రాంచీ కోర్టులో మిహిర్ దంపతులపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.