Kiran Abbavaram | ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాతో మంచి హిట్టందుకున్న కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ఇటీవలే క (KA) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడని తెలిసిందే. పాన్ ఇండియా కథాంశంతో 1970స్ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణగిరి గ్రామం నేపథ్యంలో సాగే పీరియాడిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ తెలుగుతోపాటు పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదలైంది.
బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం థియేటర్ల కొరత కారణంగా పలు ప్రాంతాల్లో విడుదల కాలేదు. తాజాగా మలయాళ వెర్షన్ రిలీజ్ టైం వచ్చేసింది. మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రాన్ని మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ టీం నవంబర్ 22న కేరళలో విడుదల చేస్తోంది. మరి మాలీవుడ్ ప్రేక్షకులు క సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తిగా మారింది.
సుజిత్-సందీప్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో 2018 ఫేం తాన్వి రామ్, గం గం గణేశా ఫేం నయన్ సారిక ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించారు. వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కించిన ఈ చిత్రానికి శ్యా్మ్ సీఎస్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాడు. కిరణ్ అబ్బవరం పాన్ ఇండియా సినిమాకు కేరళలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి మరి.
క మలయాళ వెర్షన్ రిలీజ్ డేట్..
Nov 22nd ❤️@DQsWayfarerFilm #KA pic.twitter.com/bifoaytvs9
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) November 13, 2024
Ram Gopal Varma | రామ్ గోపాల్ వర్మకు నోటీసులు అందజేసిన పోలీసులు