Rajasthan bride : దేశంలో ఎక్కడ ఎన్నికలు జరగినా ఓటింగ్ 80 శాతం దాటడం గగనంగా మారింది. మెజారిటీ ఓటర్లు ఓటేసేందుకు ఉత్సాహం చూపుతున్నా.. కొంతమంది మాత్రం ఓటును పెద్దగా పట్టించుకోవడంలేదు. ముఖ్యంగా నగరాల్లో చాలా మంది ఓటును నిర్లక్ష్యం చేస్తున్నారు. ఉన్నతవిద్యను అభ్యసించిన వారిలో కూడా కొందరు ఓటును పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇలాంటి వాళ్లకు ఖుషి అనే ఓ పెళ్లి కూతురు ఓటు విలువను గుర్తుచేసింది.
తనదే పెళ్లి జరుగుతున్నా, పెళ్లి వేడుకలు కొనసాగుతున్నా ఖుషి తన బాధ్యతను మరువలేదు. ఇళ్లంతా బంధుమిత్రుల సందడితో ఉన్నా ఆ ఏముందిలే అని అనుకోకుండా ఆమె పోలింగ్ బూత్‌కు వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజస్థాన్‌లోని దౌసా అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓటు అనేది చాలా ముఖ్యమని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఖుషి సూచించారు.
జార్ఖండ్ తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌తోపాటే రాజస్థాన్‌లోని దౌసా అసెంబ్లీ స్థానానికి బుధవారం ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా స్థానిక ఓటరైన పెళ్లి కూతరు ఖుషి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖుషి పెళ్లి దుస్తుల్లోనే పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటేసిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు..
#WATCH | Rajasthan: A bride casts her vote at a polling booth in Dausa for the Dausa Assembly by-election pic.twitter.com/smauZizosv
— ANI (@ANI) November 13, 2024
#WATCH | Dausa, Rajasthan: “Yesterday my wedding ceremony took place and today before the farewell rituals I have come to cast my vote. Voting is very important and everyone should vote…” says the bride Khushi https://t.co/DPrUX21zxj pic.twitter.com/VkFTv6iAWO
— ANI (@ANI) November 13, 2024