Rahul Gandhi | ఇటీవలి కాలంలో ఓటు చోరీ (Vote Theft) అనే మాట తెగ వినపడుతున్నది. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) దీనిపై పేటెంట్ పుచ్చుకున్నట్టు కనపడుతున్నది. ‘ఓటు చోరీ’ అంశాన్ని ఆయుధంగా చేసుకొని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీగా ఓట్ల దొంగతనం జరుగుతోందని ఆయన ఆరోపించారు. 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా ఓట్ల చోరీ జరిగినట్లు ఇటీవలే ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే, హర్యానా మాదిరే మరిన్ని రాష్ట్రాల్లో జరిగిందని రాహుల్ తాజాగా బాంబు పేల్చారు.
ప్రస్తుతం మధ్యప్రదేశ్లో పర్యటిస్తున్న రాహుల్ ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై దాడి జరుగుతోందన్నారు. హర్యానా మాదిరే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోనూ ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయంటూ బాంబు పేల్చారు. వాటిని త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు. ఓటు చోరీని కప్పిపుచ్చుకునేందుకే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) నిర్వహించారని రాహుల్ వ్యాఖ్యానించారు. బీజేపీ, ఈసీ ఉమ్మడి భాగస్వామ్యంతోనే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు.
Also Read..
Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం
Ajit Pawar | భూ కుంభకోణం.. డీల్ రద్దు చేయాలంటే రూ.42 కోట్లు చెల్లించాల్సిందే..!
Passwords | 2025లో అత్యధికమంది వాడుతున్న కామన్ పాస్వర్డ్స్ ఇవే..