Congress | దేశంలో కాంగ్రెస్ (Congress) పార్టీ పని కంచికే అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇటీవలే జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ వరుస పరాజయాలు మూటగట్టుకున్న విషయం తెలిసిందే. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. ఇప్పుడు మరో రాష్ట్రం బీహార్‌లోనూ హస్తం పార్టీకి అదే పరిస్థితి ఎదురైంది. అక్కడ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేల్చిన హైడ్రోజన్ బాంబు పనిచేయలేదు.
భారీగా ఓట్ల చోరీ జరిగిందంటూ రాహుల్ ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే బీహార్‌లో సమగ్ర ఓటర్ల జాబితాల సవరణ (ఎస్ఐఆర్)ను వ్యతిరేకిస్తూ జరిపిన ‘ఓట్ అధికార్ యాత్ర’ పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో ఆర్జేడీతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్‌కు ఓటమి తప్పలేదు. కాంగ్రెస్, ఆర్జేడీతో కూడిన ప్రతిపక్ష మహాగఠ్‌బంధన్ (Mahagathbandhan) కూటమికి బీహార్ ఓటర్లు గట్టి షాకిచ్చారు. అక్కడ ఎన్డీయే కూటమి అంచనాలకు మించి దూసుకెళ్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 122 స్థానాలను దాటి 190 స్థానాల్లో ముందంజలో ఉంది. ప్రతిపక్ష మహాగఠ్‌బంధన్ కేవలం 48 స్థానాలకే పరిమితమైంది.
ఈ నేపథ్యంలో రాహుల్‌ను లక్ష్యంగా చేసుకొని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్‌కు ఎక్కుపెట్టారు. ‘రాహుల్ గాంధీ ఎక్కడ..?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. ‘ఓట్ చోరీ అంటూ తిరిగిన రాహుల్.. ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘రాహుల్ ఎక్కడికి వెళ్లారు.. తేజస్వీని పూర్తిగా ముంచేసి సెలవుపై వెళ్లినట్లున్నారు. బీహార్ సీఎం మళ్లీ నితీశే’ అంటూ రాహుల్‌ని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టులు వైరల్ అవుతున్నాయి.
Also Read..
Mahagathbandhan | ఘోర పరాభవం.. మహాగఠ్‌బంధన్‌కు గతంలోకంటే సగం స్థానాలు కూడా దక్కలేదు..!
Tejashwi Yadav | మహాగఠ్‌బంధన్‌కు షాక్.. వెనుకంజలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్
NDA | బీహార్‌లో ఎన్డీయే జోరు.. 191 స్థానాల్లో ముందంజ