NDA | బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే (NDA) జోరు కొనసాగుతోంది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ముందంజలో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం.. ఎన్డీయే కూటమి ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్‌ను దాటి ఏకంగా 191 స్థానాల్లో ముందంజలో ఉంది. ప్రతిపక్ష మహాగఠ్‌బంధన్ కేవలం 50 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు మూడు స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నారు.
మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి రెండు విడతల్లో పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. నవంబర్ 6వ తేదీన తొలి విడత, నవంబర్ 11న రెండో విడత పోలింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో జేడీయూ 101 స్థానాల్లో, బీజేపీ 101 స్థానాల్లో, లోక్ జన్‌శక్తి (రాంవిలాస్) 28 స్థానాల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో మెజార్టీ మార్క్ 122 స్థానాలు. గత ఎన్నికలతో పోల్చితే ఎన్డీయే కూటమి తన సీట్లను భారీగా పెంచుకున్నది. 2020 ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 125 సీట్లు దక్కాయి. దీంతో బీహార్ ప్రజలు మరోసారి బీజేపీ కూటమికి భారీ విజయాన్ని అందించనున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
Also Read..
Giriraj Singh | బీహార్‌లో గెలుపు ఎన్డీయేదే.. నెక్ట్స్ బెంగాల్ వంతు : కేంద్ర మంత్రి
Victory Celebrations | 500 Kg లడ్డూలు.. 5 లక్షల రసగుల్లాలు.. బీహార్‌లో ఎన్డీయే విక్టరీ సెలబ్రేషన్స్
CM Nitish Kumar: టైగర్ అబీ జిందా హై.. నితీశ్ ఇంటి ముందు భారీ పోస్టర్