Giriraj Singh | బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ (Bihar Election Results) కొనసాగుతున్నది. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఎన్డీయే (NDA) భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం ఎన్డీయే కూటమి 160 స్థానాల్లో ముందంజలో ఉన్నది. ప్రతిపక్ష మహాగఠ్‌బంధన్ కేవలం 60 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బీహార్‌లో విజయం ఎన్డీయేదే అని కేంద్ర మంత్రి (Union Minister) గిరిరాజ్ సింగ్ (Giriraj Singh) అన్నారు. తమ పార్టీ తదుపరి టార్గెట్ బెంగాల్ అన్నారు. ‘బీహార్ ప్రజలు అరాచక, అవినీతి నాయకత్వాన్ని తిరస్కరించారు. అంకితభావంతో కూడిన బీజేపీ కార్యకర్తగా నేను ఒకటి స్పష్టంగా చెబుతున్నాను. బీహార్ విజయం మనదే (ఎన్డీయే). తర్వాత బెంగాల్ వంతు’ అని వ్యాఖ్యానించారు.
Also Read..
Victory Celebrations | 500 Kg లడ్డూలు.. 5 లక్షల రసగుల్లాలు.. బీహార్‌లో ఎన్డీయే విక్టరీ సెలబ్రేషన్స్
Bihar Election Results | భారీ ఆధిక్యం దిశగా ఎన్డీయే.. 60 స్థానాలతో సరిపెట్టుకున్న మహాగఠ్‌బంధన్
Nitish Kumar: మళ్లీ చక్రం తిప్పిన సుశాసన్ బాబు.. ఎమ్మెల్సీగానే మరోసారి నితీశ్ షాక్ !