పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ (Bihar Election Results) కొనసాగుతున్నది. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఎన్డీయే భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నది. ఇప్పటివరకు 160 స్థానాల్లో అధికార కూటమి ముందంజలో ఉన్నది. నితీశ్ కుమార్ 20 ఏండ్ల పాలనకు ఈసారి ఫుల్స్టాప్ పెట్టాలనుకున్న మహాగఠ్‌బంధన్ కేవలం 60 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 4 చోట్ల ముందంజలో ఉన్నారు. మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో మెజార్టీ మార్క్ 122 స్థానాలు.
గత ఎన్నికలతో పోల్చితే ఎన్డీయే కూటమి తన సీట్లను భారీగా పెంచుకున్నది. 2020 ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 125 సీట్లు దక్కాయి. ప్రస్తుతం 160 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్నది. దీంతో బీహార్ ప్రజలు మరోసారి బీజేపీ కూటమికి భారీ విజయాన్ని అందించనున్నట్లు తెలుస్తున్నది.