Victory Celebrations | బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ (Bihar Election Results) కొనసాగుతున్నది. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఎన్డీయే (NDA) భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నది. మెజారిటీ మార్కును దాటి అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం ఎన్డీయే కూటమి 160 స్థానాల్లో ముందంజలో ఉన్నది. నితీశ్ కుమార్ 20 ఏండ్ల పాలనకు ఈసారి ఫుల్స్టాప్ పెట్టాలనుకున్న మహాగఠ్‌బంధన్ కేవలం 60 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి శ్రేణులు విజయోత్సవానికి సిద్ధమవుతున్నారు (Victory Celebrations). ఇప్పటికే పలు చోట్ల సంబరాలు మొదలు పెట్టారు.
మరోవైపు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పాట్నాలో పెద్ద సంఖ్యలో మిఠాయిలు తయారు చేస్తున్నారు. బీజేపీ నేతలు ఏకంగా 500 కేజీల లడ్డూలు (Laddoos), 5 లక్షల రసగుల్లాలు (Rasgullas), గులాబ్జామూన్లను ఆర్డర్ చేశారు. దీంతో భారీ స్థాయిలో మిఠాయిలను దుకాణ దారులు తయారు చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల్లో ఎన్డీయే భారీ మెజారిటీతో దూసుకెళ్తుండటంతో.. నేతలు ఉత్సాహంలో ఉన్నారు. ఈ మేరకు పార్టీ మద్దతుదారులు, వర్కర్స్‌కి ప్రత్యేక విందు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Also Read..
Bihar Election Results | భారీ ఆధిక్యం దిశగా ఎన్డీయే.. 60 స్థానాలతో సరిపెట్టుకున్న మహాగఠ్‌బంధన్
Bihar Election Result | 132 స్థానాల్లో ఆధిక్యంలో.. మెజార్టీ మార్క్ దాటిన ఎన్డీయే
Bihar Election Result | రాఘోపూర్‌లో తేజస్వీ యాదవ్ ఆధిక్యం.. 73 స్థానాల్లో ఎన్డీయే ముందంజ