పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు (Bihar Election Result) కొనసాగుతున్నది. మహాగఠ్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ ముఖ్యనేత తేజస్వీ యాదవ్ రాఘోపూర్ నియోజకవర్గంలో ముందంజలో కొనసాగుతున్నారు. ఇక ఎన్డీయే కూటమి 70 స్థానాల్లో ముందంజలో ఉండగా, ఎంజీబీ 51 చోట్ల, ఇతరులు 5 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తారాపూర్‌లో ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, మొకామాలో జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్, అలీనగర్‌లో గాయని, బీజేపీ అభ్యర్థి మైథిలీ ఠాకూర్ వెనుకంజలో ఉన్నారు.