న్యూఢిల్లీ: బీహార్‌లో నితీశ్(CM Nitish Kumar) మళ్లీ దూసుకెళ్లున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం నితీశ్ కుమార్ పార్టీ మళ్లీ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తాజా సమాచారం ప్రకారం ఎన్డీఏ కూటమి 180 స్థానాల్లో అగ్రస్థానంలో దూసుకెళ్తున్నది. ఎన్డీఏ విక్టరీ బీహార్‌లో ఖాయమైంది. నితీశ్ ఖాతాలోనే ఆ సక్సెస్ పడింది. ఇక సీఎం నితీశ్ ఇంటి ముందు ఇవాళ ఓ భారీ పోస్టర్ దర్శనమిచ్చింది. టైగర్ అబీ జిందా హై అంటూ ఆకట్టుకునే రీతిలో ఆ పోస్టర్ వేశారు. పులి ఇంకా బ్రతికే ఉంది అంటూ ఆ పోస్టర్‌పై పెద్ద అక్షరాల్లో రాశారు. సినిమా పోస్టర్ స్టయిల్లో ఆ పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఇవాళ ఓట్ల కౌంటింగ్ నేపథ్యంలో ఆ పోస్టర్ అందర్నీ అట్రాక్ట్ చేస్తున్నది.
ప్రస్తుతం ట్రెండ్స్ మాత్రమే వస్తున్నాయని, కానీ ఒక్కటి మాత్రం క్లియర్ అని, రాజకీయాల్లో నితీశ్ నిజంగానే పులి అంటూ ఓ మద్దతుదారుడు పేర్కొన్నాడు. 243 స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీలో.. ఎన్డీఏ కూటమి ఇప్పటి వరకు 191 స్థానాల్లో ముందంలో ఉన్నది. బీజేపీ 80, జేడీయూ 84 స్థానాల్లో అగ్రస్థానంలో ఉన్నాయి. మహాఘట్బంధన్కు చెందిన ఆర్జేడీ 37 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది.