Tejashwi Yadav | బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ (RJD) నేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) వెనుకంజలో ఉన్నారు. ప్రతిపక్ష మహాగఠ్బంధన్ (Mahagathbandhan) కూటమి నుంచి సీఎం అభ్యర్థిగా ఉన్న తేజస్వీ యాదవ్ రాఘోపుర్ (Raghopur) నుంచి బరిలో దిగిన విషయం తెలిసిందే. అయితే, తాజా ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ కంటే తేజస్వీ 3 వేల ఓట్ల వెనుకంజలో ఉన్నారు.
మరోవైపు ఈ ఎన్నికల్లో ఎన్డీయే ముందంజలో దూసుకెళ్తోంది. కూటమి ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ 122ను దాటి 191 స్థానాల్లో ముందంజలో ఉంది. ప్రతిపక్ష మహాగఠ్బంధన్ హాఫ్ సెంచరీని కూడా చేరుకోలేకపోయింది. ప్రస్తుతం 47 స్థానాల్లో మాత్రమే ముందంజలో కొనసాగుతోంది. 2020 ఎన్నికల్లో ప్రతిపక్షపార్టీ ఏకంగా 114 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఎన్నికల్లో అందులో సగం స్థానాలను కూడా దక్కించుకోలేని పరిస్థితి కనిపిస్తోంది.
Also Read..
Mizoram | మిజోరం ఉప ఎన్నిక.. మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థి ఘన విజయం
NDA | బీహార్లో ఎన్డీయే జోరు.. 191 స్థానాల్లో ముందంజ
Giriraj Singh | బీహార్లో గెలుపు ఎన్డీయేదే.. నెక్ట్స్ బెంగాల్ వంతు : కేంద్ర మంత్రి