Mizoram | బీహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటూ దేశంలో జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ నేడు కొనసాగుతోంది. మిజోరం (Mizoram) రాష్ట్రంలోని డంపా నియోజకవర్గానికి (Dampa Assembly) జరిగిన ఉప ఎన్నికలో మిజో నేషనల్ ఫ్రంట్ (Mizo National Front) అభ్యర్థి డాక్టర్ ఆర్.లాల్తంగ్లిన (Dr R.Lalthangliana) విజయం సాధించారు. 6981 ఓట్లతో గెలుపొందారు. ఎమ్మెల్యే లాల్రింట్లుంగా సైలా మృతితో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. నవంబర్ 11న ఈ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది.
Mizo National Front candidate Dr R.Lalthangliana wins Dampa Assembly by-election in Mizoram. pic.twitter.com/ZYmViUrYyx
— ANI (@ANI) November 14, 2025
మరోవైపు బీహార్ రాష్ట్రంలో ఎన్డీయే ముందంజలో దూసుకెళ్తోంది. కూటమి ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ 122ను దాటి 191 స్థానాల్లో ముందంజలో ఉంది. ప్రతిపక్ష మహాగఠ్బంధన్ కేవలం 50 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. బీహార్ ప్రజలు మరోసారి బీజేపీ కూటమికి భారీ విజయాన్ని అందించనున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
Also Read..
NDA | బీహార్లో ఎన్డీయే జోరు.. 191 స్థానాల్లో ముందంజ
Giriraj Singh | బీహార్లో గెలుపు ఎన్డీయేదే.. నెక్ట్స్ బెంగాల్ వంతు : కేంద్ర మంత్రి
Victory Celebrations | 500 Kg లడ్డూలు.. 5 లక్షల రసగుల్లాలు.. బీహార్లో ఎన్డీయే విక్టరీ సెలబ్రేషన్స్