Mahagathbandhan | బీహార్‌లో ప్రతిపక్ష మహాగఠ్‌బంధన్‌కు ఘోర పరాభవం ఎదురైంది. అధికార జేడీ(యూ), బీజేపీ పార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమిని దించి ఈసారి ఎలాగైనా అధికారం చేపడదామని కలలు కంటున్న కాంగ్రెస్, ఆర్జేడీకి బీహార్ ఓటర్లు గట్టి షాకిచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పేల్చిన హైడ్రోజన్ బాంబు పనిచేయలేదు. బీహార్‌లో సమగ్ర ఓటర్ల జాబితాల సవరణ (ఎస్ఐఆర్)ను వ్యతిరేకిస్తూ జరిపిన ‘ఓట్ అధికార్ యాత్ర’ పెద్దగా ప్రభావం చూపలేదు. బీహారీలు మళ్లీ ఎన్డీయేకే జై కొట్టారు.
ఇప్పటి వరకూ వెళ్లడైన ఫలితాల సరళిని చూస్తే.. అధికార ఎన్డీయే కూటమి ముందంజలో దూసుకెళ్తోంది. కూటమి ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ 122ను దాటి 191 స్థానాల్లో జోరు ప్రదర్శిస్తోంది. ఈ ఎన్నికల్లో విజయం తమదే అంటూ చెప్పుకుంటున్న ప్రతిపక్ష మహాగఠ్‌బంధన్.. ఫలితాల్లో హాఫ్ సెంచరీని కూడా చేరుకోలేకపోవడం గమనార్హం. ప్రస్తుతం 47 స్థానాల్లో మాత్రమే ముందంజలో కొనసాగుతోంది. 2020 ఎన్నికల్లో ప్రతిపక్షపార్టీ ఏకంగా 114 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఎన్నికల్లో అందులో సగం స్థానాలను కూడా దక్కించుకోలేక పోవడం గమనార్హం.
ప్రతిపక్ష మహాగఠ్‌బంధన్ (Mahagathbandhan) కూటమి నుంచి సీఎం అభ్యర్థిగా ఉన్న తేజస్వీ యాదవ్ కూడా తాజా ఫలితాల్లో వెనుకంజలో ఉండటం ఆ పార్టీకి గట్టి షాకే అని చెప్పాలి. తేజస్వీ రాఘోపుర్ (Raghopur) నుంచి బరిలో దిగిన విషయం తెలిసిందే. తాజా ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ కంటే తేజస్వీ 3 వేల ఓట్ల వెనుకంజలో కొనసాగుతున్నారు. మరోవైపు మహువాలో తేజస్వీ సోదరుడు, జనశక్తి జనతాదళ్ నాయకుడు తేజ్‌ప్రతాప్ యాదవ్ వెనుకంజలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో తేజస్వీ నేతృత్వంలోని ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ 61 స్థానాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
Also Read..
Tejashwi Yadav | మహాగఠ్‌బంధన్‌కు షాక్.. వెనుకంజలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్
Victory Celebrations | 500 Kg లడ్డూలు.. 5 లక్షల రసగుల్లాలు.. బీహార్‌లో ఎన్డీయే విక్టరీ సెలబ్రేషన్స్