గురువారం 16 జూలై 2020
National - Jun 20, 2020 , 12:14:13

ప్ర‌కృతి మాయ‌.. అర‌చేతిలో నీరు తాగుతున్న పాము

ప్ర‌కృతి మాయ‌.. అర‌చేతిలో నీరు తాగుతున్న పాము

ప్ర‌కృతి గురించి చెప్పాలంటే ఎవ‌రూ పూర్తిగా చెప్ప‌లేరు. ఎప్పుడు ఎలాంటి అద్భుతాలు జ‌రుగుతాయో తెలియ‌దు. అవి జ‌రిగిన‌ప్పుడు చూడాల్సిందే. ప్ర‌కృతిలో జ‌రిగే వింత‌లు, విశేషాల‌ను ప‌రిచ‌యం చేస్తూ రోజుకో వీడియోతో ముందుకు వ‌స్తారు ఇండియ‌న్ ఫారెస్ట్ అధికారి సుశాంత నంద‌. ఇటీవ‌ల అర‌చేతిలోని నీటిని తాగుతున్న పాము వీడియోను ట్విట‌ర్‌లో పోస్ట్ చేశాడు. ఇది పెట్టి‌న కాసేప‌టికే వైర‌ల్‌గా మారింది.

సాధార‌ణంగా పాములు పాలు, నీటిని నాలుక సాయంతో తాగుతాయ‌ని తెలుసు. కానీ 'ఈ ప‌చ్చ పాము మాత్రం నాలుక‌తో నీరు తాగ‌లేదు. అందుకు రెండు ద‌వ‌డ‌ల‌ను ఉప‌యోగించింది. వీడియోలో బాగా గ‌మ‌నించిన‌ట్ల‌యితే రెండు ద‌వ‌డ‌లు క‌దులుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. నాలుక అస‌లు బ‌య‌ట పెట్ట‌నేలేదు' అనే క్యాప్ష‌న్‌ను జోడించి సుశాంత నంద సోష‌ల్‌మీడియాలో షేర్ చేశారు. వీడియో చూసిన వాళ్లంతా సో క్యూట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 


logo