Fire | గుజరాత్ (Gujarat) రాష్ట్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అహ్మదాబాద్ (Ahmedabad)లోని ఓ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో గల ఏడో అంతస్తులో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ భయాందోళన వాతావరణం నెలకొంది. శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదంతో అపార్ట్మెంట్లోని నివాసితులు ప్రాణాలను దక్కించుకునేందుకు బాల్కనీల నుంచి దూకారు.
నాలుగో అంతస్తులో ఉన్న ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి బాల్కనీ నుంచి సురక్షితంగా బయటపడుతున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సదరు మహిళ తమ ఇంటి బాల్కనీ నుంచి తమ ఇద్దరు పిల్లలను ఎంతో సాహసం చేసి స్థానికుల సాయంతో మూడో అంతస్తులోకి దింపింది. ఆ తర్వాత ఆమెకూడా అలానే తప్పించుకుంది. మరికొంతమంది నివాసితులు బాల్కనీల నుంచి దూకి ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఘటన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని ఏడు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపుచేశారు. బిల్డింగ్ నుంచి దాదాపు 18 మందిని రక్షించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు.
અમદાવાદના ખોખરા વિસ્તારમાં પરિષ્કર-1 બિલ્ડીંગમાં આગ. સુરતની તક્ષશિલા જેવા ભયાનક બચાવ દ્રશ્યો.
ક્યાં છે ફાયર સિસ્ટમ અને ફાયરબ્રિગેડ?#firerescue #fire #gujarat #Ahmedabad #Ahmedabadmayour pic.twitter.com/xFPQZkFFR8— Dilip Patel દિલીપ પટેલ (@dmpatel1961) April 11, 2025
Also Read..
Dust Storm: ఢిల్లీలో డస్ట్ స్టార్మ్.. 205 విమానాలు ఆలస్యం
Jammu Kashmir: ఆక్నూర్ సెక్టార్లో ఎన్కౌంటర్.. ఆర్మీ జేసీవో మృతి
Gambling Operation: అమెరికాలో గ్యాంబ్లింగ్ ఆపరేషన్.. భారత సంతతి రాజకీయవేత్తపై అభియోగాలు