Jammu Kashmir: ఆక్నూర్ సెక్టార్లో ఎన్కౌంటర్.. ఆర్మీ జేసీవో మృతి
Jammu Kashmir: ఎల్వోసీ వద్ద ఆక్నూర్ సెక్టార్లో ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదుల చొరబట్లను అడ్డుకునే ప్రయత్నంలో.. ఆర్మీ జేసీవో మృతిచెందాడు. ఇదే సెక్టార్లో ఫిబ్రవరిలో ఐఈడీ పేలుడు వల్ల ఇద్దరు జవాన్లు మృతిచెందిన విషయం తెలిసిందే.
జమ్మూ: జమ్మూకశ్మీర్(Jammu Kashmir)లోని అక్నూర్ సెక్టార్ వద్ద ఉన్న నియంత్రణ రేఖ దగ్గర ఎదురుకాల్పులు జరిగాయి. ఆ ఎన్కౌంటర్లో ఆర్మీకి చెందిన జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే చొరబాటకు ప్రయత్నించిన ఉగ్రవాదుల్ని తిప్పికొట్టారు. కేరీ బత్తల్ ఏరియా వద్ద ఉన్న ఓ నది సమీపంలో భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నించారు. అలర్ట్గా ఉన్న ఆర్మీ వారి కదలికలపై కన్నేసింది. ఆ ఉగ్రమూకలపై సైన్యం ఎదురుకాల్పులు చేసింది. తొలుత గాయపడ్డ జేసీవో ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని అదనపు బలగాలతో కార్డన్ చేశారు. ఉగ్రవాదుల ఏరివేతకు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
అక్నూర్ సెక్టార్ వద్దే ఫిబ్రవరి 11వ తేదీన జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు మృతిచెందారు. ఉగ్రవాదులు ఐఈడీ పేల్చడంతో ఓ కెప్టెన్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో తాజా ఇండోపాక్ బ్రిగ్రేడ్ కమాండర్ స్థాయి మీటింగ్ జరిగిన తర్వాత ఎన్కౌంటర్ జరగడం శోచనీయం. సరిహద్దు వద్ద ఉద్రిక్తతలను తగ్గించేందుకు బ్రిగేడియర్ స్థాయి చర్చలు జరిగినా ఫలితం లేకుండా ఉంది. సీమాంతర ఉగ్రవాద చర్యలను, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం లాంటి అంశాలపై ఆ చర్చల్లో భారతీయ ఆర్మీ నిరసన వ్యక్తం చేసింది.
White Knight Corps of the Indian Army tweets, “General Officer Commanding (GOC) White Knight Corps and all ranks salute the supreme sacrifice of Braveheart Sub Kuldeep Chand of 9 PUNJAB. He laid down his life while gallantly leading a Counter-Infiltration operation along the Line… pic.twitter.com/hyMSCvShhE
— ANI (@ANI) April 12, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

