Uniform Civil Code | అమల్లోకి వచ్చిన ఉమ్మడి పౌరస్మృతి.. యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్
Uniform Civil Code | బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరాఖండ్ (Uttarakhand)లో ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code) అమల్లోకి వచ్చింది.
Uniform Civil Code | బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరాఖండ్ (Uttarakhand)లో ఉమ్మడి పౌర స్మృతి (Uniform Civil Code) అమల్లోకి వచ్చింది. దీంతో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత యూసీసీ (UCC)ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించింది. ఈ సందర్భంగా ప్రతి ఏటా జనవరి 27ని ఉత్తరాఖండ్‌లో యూసీసీ డేగా జరుపుకోనున్నట్లు సీఎం ప్రకటించారు.
#WATCH | Dehradun: On the implementation of UCC (Uniform Civil Code), Uttarakhand Chief Minister Pushkar Singh Dhami says, “…Now every year 27th January will be celebrated as Uniform Civil Code Day in Uttarakhand…” pic.twitter.com/BepZvH5bW9
— ANI (@ANI) January 27, 2025
గతేడాది ఫిబ్రవరి 7న యూసీసీ బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం పొందింది. 2024, మార్చి 11 ఆ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మార్చి 12న నోటిఫికేషన్ జారీ చేశారు. ఉమ్మడి పౌర స్మృతి 2024 చట్టాన్ని ఈ ఏడాది జనవరిలో పూర్తిగా అమలు చేయనున్నట్లు అందులో పేర్కొన్నారు. దీని అమలు కోసం ప్రత్యేక పోర్టల్, మొబైల్ యాప్ ఏర్పాటు చేశారు. మహిళలు, పిల్లల సాధికారతే లక్ష్యంగా యూసీసీ అమలు ఉంటుందని సీఎం ధామి గతంలో తెలిపారు. కాగా, పోర్చుగీస్ పాలనలో ఉన్నప్పటి నుంచి గోవాలో ఉమ్మడి పౌరస్మృతి అమల్లో ఉంది.
యూసీసీలో ఉన్న నిబంధనలేంటి?
- ఉత్తరాఖండ్ నివాసితులకు కులం, మతంతో సంబంధం లేకుండా చట్టం వర్తిస్తుంది.
- వివాహం, విడాకులు, ఆస్తుల వారసత్వం, ఆస్తి వీలునామాల రూపకల్పన వంటి అంశాల్లో లింగ సమానత్వాన్ని సాధించేలా ఉంటుంది.
- వివాహం చేసుకోవాలంటే పురుషులకు కనీస వయస్సు 21 , స్త్రీలకు 18 సంవత్సరాలు ఉండాలి.
- వివాహ నమోదు తప్పనిసరి.
- భాగస్వామి నుంచి విడిపోయిన మహిళకు భరణం పొందే హక్కు ఉంటుంది.
- అన్ని మతాల్లో బహుభార్యత్వాన్ని నిషేధిస్తున్న బిల్లు.. ఆయా మతాలవారిని తమ ఆచారాల ప్రకారం వివాహాలు చేసుకోవచ్చు.
- హలాల్ విధానంపై కూడా నిషేధం విధించారు.
- సహజీవనం చేయాలనుకొనే వ్యక్తులు వారి వివరాలు రిజిస్టర్ చేసుకోవాలి.
- చట్టాన్ని అతిక్రమిస్తే జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.
- సహజీవనం ద్వారా పుట్టిన బిడ్డకు చట్టపరమైన గుర్తింపు లభిస్తుంది.
- త్రివిధ దళాలు (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్)లో పని చేస్తున్నవారు, యుద్ధంలో నిమగ్నమై ఉన్నవారి కోసం ప్రివిలేజ్డ్ విల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ సౌలభ్యాన్ని వినియోగించుకొని వీలునామాను వేగంగా, సులువుగా రూపొందించవచ్చు.
Also Read..
Amit Shah | మహాకుంభమేళాలో అమిత్ షా.. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు
SEBI Chief | సెబీ చీఫ్ పోస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానించిన ప్రభుత్వం.. ఫిబ్రవరి 17 చివరి గడువు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

