SEBI Chief | స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ చైర్మన్ (SEBI Chief) పదవికి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రస్తుతం సెబీ చైర్ పర్సన్ (Sebi chief) మాధాబీ పురీ బుచ్ (Madhabi Puri Buch) మూడేళ్ల పదవీ కాలం ఫిబ్రవరి 28తో ముగియనుంది. ఈ నేపథ్యంలో సెబీ కొత్త సారధి కోసం ప్రభుత్వం నియామకాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే దరఖాస్తులను ఆహ్వానించింది (Government Invites Application). ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల విభాగం సోమవారం ఓ పబ్లిక్ అడ్వర్టైజ్మెంట్ జారీ చేసింది. అర్హత గలవారు ఫిబ్రవరి 17లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
కాగా, సెబీ చైర్మన్‌గా మాధాబీ పూరీ బుచ్‌ను కేంద్రం 2022 ఫిబ్రవరి 28న నియమించిన విషయం తెలిసిందే. దీంతో ఆమె అదే ఏడాది మార్చి 2వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. సెబీకి ఓ మహిళ చైర్మన్‌గా నియామకం కావడం ఇదే తొలిసారి. మాధవి గతంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ హెడ్‌గా సేవలందించారు. 2017 నుంచి 2021 మధ్య కాలంలో సెబీ పూర్తి స్థాయి మెంబర్‌గా పని చేశారు.
కాగా, సెబీ చైర్పర్సన్ మాధాబీ పురీ బుచ్ గత కొద్దికాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అదానీ గ్రూపుతో మాధాబీ పురీ బుచ్, ఆమె భర్త ధావల్ బుచ్‌లకు గల అనుబంధంపై యూఎస్ షార్ట్ సెల్లర్ కం రీసెర్చ్ కంపెనీ హిండెన్ బర్గ్ సంచలన ఆరోపణలే అందుకు కారణం. అదానీ విదేశీ ఫండ్లలో మాధాబీ పురీ బుచ్ (Madhabi Puri Buch), ఆమె భర్తకు వాటాలున్నాయని హిండెన్‌బర్గ్ సంచలన ఆరోపణలు చేసింది. ఈ నివేదిక దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది. ఈ నేపథ్యంలో సెబీ చీఫ్‌కు పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (Public Accounts Committee) సమన్లు కూడా జారీ చేసింది. అయితే, ఆతర్వాత విచారణ అనంతరం ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.
Also Read..
“Sebi chief | పార్లమెంటరీ కమిటీ సమన్లను దాటవేసిన సెబీ చీఫ్..!”
“Madhabi Puri Buch | ఇంత జరుగుతున్నా మౌనంగా ఉన్నారంటే.. సెబీ చీఫ్‌పై హిండెన్‌బర్గ్ కొత్త సందేహాలు”
“SEBI | సెబీ చీఫ్ బుచ్ రాజీనామా చేయాలి.. ఉద్యోగుల నిరసన”