Amit Shah | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj)లో జరుగుతున్న మహాకుంభమేళా (Maha Kumbh 2025)లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగా, యమున, సరస్వతీ నదులు కలిసే త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు (holy dip) ఆచరించారు. అనంతరం ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి అధికారులతో సమావేశాలు నిర్వహించి మహాకుంభ్ ఏర్పాట్లపై సమీక్షించారు. మరోవైపు షా పర్యటన నేపథ్యంలో నగరంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కీలక కూడళ్లు, కార్యక్రమాల వేదికలపై నిఘా పెంచారు.
#WATCH | #MahaKumbh2025 | Union Home Minister Amit Shah takes a holy dip at Triveni Sangam in Prayagraj, Uttar Pradesh. pic.twitter.com/xyCiwqIM3Z
— ANI (@ANI) January 27, 2025
ఈ మహాకుంభమేళాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) కూడా పాల్గొననున్నారు. ఫిబ్రవరి 5వ తేదీన ప్రధాని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సైతం మహాకుంభ్‌ను సందర్శించే అవకాశం ఉందని తెలిసింది. ఫిబ్రవరి 10వ తేదీన రాష్ట్రపతి ముర్ము మహాకుంభమేళాకు వెళ్లనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 1వ తేదీన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ సైతం ప్రయాగ్‌రాజ్ వెళ్లనున్నారు.
#WATCH | #MahaKumbh2025 | Union Home Minister Amit Shah arrives at Selfie Point Arail Ghat in Uttar Pradesh. He will take a holy dip at #MahaKumbh2025 in Prayagraj shortly.
CM Yogi Adityanath, Deputy CMs KP Maurya and Brajesh Pathak, and others are with him. pic.twitter.com/cSiFJNvTMY
— ANI (@ANI) January 27, 2025
సంక్రాంతి రోజున ప్రారంభమైన (జనవరి 13) మహా కుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రితో ముగుస్తుంది. 45 రోజులపాటు సాగనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఇప్పటికే 14 కోట్ల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించి త్రివేణీ సంగమంలో స్నానాలు ఆచరించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల సంఖ్య 50 కోట్లు దాటుతుందని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది.
#WATCH | #MahaKumbh2025 | Union Home Minister Amit Shah takes a holy dip at Triveni Sangam in Prayagraj, Uttar Pradesh.
Uttar Pradesh CM Yogi Adityanath and several saints are accompanying the Home Minister in the holy dip. pic.twitter.com/y42taPawFy
— ANI (@ANI) January 27, 2025
Also Read..
Mahakumbh: పుణ్యస్నానం కోసం కుంభమేళాకు.. పోలీసులకు చిక్కిన లిక్కర్ స్మగ్లర్
Jasprit Bumrah | కోల్డ్ ప్లే కన్సర్ట్‌లో బుమ్రా సందడి.. వీడియో వైరల్
UCC | నేటి నుంచి ఉత్తరాఖండ్‌లో అమల్లోకి ఉమ్మడి పౌరస్మృతి