Maha kumbh | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ (Prayagraj)లో మహా కుంభమేళా (Maha Kumbh) కొనసాగుతోంది. 45 రోజులపాటు సాగే ఈ మహాకుంభ మేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అంచనాలకు మించి తరలివస్తున్నారు. తాజాగా యూపీ సీఎం (UP CM) యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) సైతం మహాకుంభమేళాకు వెళ్లారు.
#WATCH | Uttar Pradesh CM Yogi Adityanath along with Deputy CMs Keshav Prasad Maurya, Brajesh Pathak and other cabinet ministers take a holy dip in Triveni Sangam during the ongoing #Mahakumbh in Prayagraj. pic.twitter.com/6HO9YtfLyo
— ANI (@ANI) January 22, 2025
డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేశ్ పాఠక్ సహా కేబినెట్ మంత్రులతో కలిసి త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. సంక్రాంతి రోజున ప్రారంభమైన (జనవరి 13) మహా కుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రితో ముగుస్తుంది. 45 రోజులపాటు సాగనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల సంఖ్య 50 కోట్లు దాటుతుందని యూపీ సర్కార్ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో కోట్లాది మందికి తగిన రీతిలో ఏర్పాటు చేసింది యూపీ ప్రభుత్వం.
#WATCH | Uttar Pradesh CM Yogi Adityanath along with Deputy CMs Keshav Prasad Maurya, Brajesh Pathak and other cabinet ministers take a holy dip in Triveni Sangam during the ongoing #Mahakumbh in Prayagraj. pic.twitter.com/o4pk7QIubR
— ANI (@ANI) January 22, 2025
#WATCH | Uttar Pradesh CM Yogi Adityanath along with Deputy CMs Keshav Prasad Maurya, Brajesh Pathak and other cabinet ministers offer prayers at Triveni Sangam during the ongoing #Mahakumbh in Prayagraj. pic.twitter.com/0F0QTLIRVW
— ANI (@ANI) January 22, 2025
Also Read..
Maha Kumbh | అంతరిక్షం నుంచి మహాకుంభ మేళా.. ఫొటోలు విడుదల చేసిన ఇస్రో
six planets | ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం.. ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు
Illegal Migrants | ట్రంప్ నిర్ణయంతో అప్రమత్తమైన భారత్.. వారిని వెనక్కి రప్పించే యోచనలో కేంద్రం..!