Viral news : ఆ ఇద్దరికి వివాహం జరిగి 25 ఏళ్లు. వారికి ఇద్దరు ఎదిగిన పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో భార్య తన ప్రియుడితో కలిసి రెడ్ హ్యాండెడ్‌గా భర్త కంటపడింది. దాంతో ఆ భర్త విచిత్రమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇద్దరికీ దగ్గరుండి వివాహం జరిపించాడు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని వారణాసి (Varansi) నగరంలో ఈ ఘటన జరిగింది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా (Social media) లో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. మీర్జాపూర్ జిల్లాకు చెందిన అర్వింద్ పటేల్, చందౌలి జిల్లా హమీద్‌పూర్‌కు చెందిన రీనాకు 25 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. 25 ఏళ్లుగా ఇద్దరూ కాపురం చేస్తున్నారు. వారికి ఇద్దరు ఎదిగిన పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో రీనాకు చందౌలికే చెందిన సియారామ్ యాదవ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర బంధానికి దారితీసింది.
సియారామ్ గతంలో అర్వింద్ పటేల్‌కు చెందిన దుకాణంలో పనిచేసే వాడు. ఆ సమయంలోనే అతడికి రీనాతో పరిచయం ఏర్పడింది. అది క్రమంగా వివాహేతర బంధానికి దారితీసింది. దాదాపు 20 ఏళ్లుగా ఇద్దరి మధ్య వివాహేతర బంధం కొనసాగింది. వారిపై అనుమానంతో అర్వింద్ పటేల్ కొన్నేళ్లుగా పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఎట్టకేలకు ఇప్పుడు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
దాంతో ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం సియారామ్ కుటుంబసభ్యులకు కూడా విషయం తెలియజేశాడు. రీనా పుట్టింటి వాళ్లకు కూడా సమాచారం ఇచ్చాడు. ఇద్దరివైపు కుటుంబసభ్యులను పిలిపించి వారికి పెండ్లి చేయాలని నిర్ణయించినట్లు తెలిపాడు. రెండు వైపుల వారిని ఒప్పించి ఆ ఇద్దరికి వారణాసిలోని ఓ గుడిలో వివాహం చేశాడు. ఈ ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది.