Lok Sabha | ఆ బిల్లులను జేపీసీకి పంపే తీర్మానానికి ఆమోదం.. లోక్సభ సాయంత్రం 5 గంటల వరకు వాయిదా
Lok Sabha | ప్రధాన మంత్రి (Prime Minister) గానీ, ముఖ్యమంత్రులు (Chief Ministers) గానీ, మంత్రులు (Ministers) గానీ తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయ్యి వరుసగా 30 రోజులపాటు జైల్లో నిర్బంధంలో ఉంటే అట్టి వారిని పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే మూడు బిల్లులను కేంద్ర హోంశాఖ మంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) మంగళవారం లోక్సభ (Lok Sabha) లో ప్రవేశపెట్టారు.
Lok Sabha : ప్రధాన మంత్రి (Prime Minister) గానీ, ముఖ్యమంత్రులు (Chief Ministers) గానీ, మంత్రులు (Ministers) గానీ తీవ్రమైన నేరారోపణలతో అరెస్టయ్యి వరుసగా 30 రోజులపాటు జైల్లో నిర్బంధంలో ఉంటే అట్టి వారిని పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే మూడు బిల్లులను కేంద్ర హోంశాఖ మంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) మంగళవారం లోక్సభ (Lok Sabha) లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీల నుంచి పెద్దఎత్తున నిరసన వ్యక్తమైంది.
కేంద్రం హడావిడిగా లోక్సభలో ప్రవేశపెట్టిన ప్రతిపాదిత బిల్లులు రాజ్యాంగం, సమాఖ్య వాదానికి వ్యతిరేకంగా ఉన్నట్లు విపక్షాలు ఆరోపించాయి. అయితే ఈ బిల్లులను హడావిడిగా తీసుకొచ్చారనే విమర్శలను అమిత్ షా తోసిపుచ్చారు. వాటిని సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు లోకసభలో తీర్మానం ప్రవేశపెట్టగా ఆ తీర్మానానికి దిగువ సభ ఆమోదం తెలిపింది.
అంతకుముందు మధ్యాహ్నం 2 గంటలకు లోక్సభలో మూడు బిల్లులను ప్రవేశపెట్టిన సందర్భంలో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు బిల్లుల ప్రతులను చించిపారేశారు. వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. గుజరాత్ హోంమంత్రిగా ఉన్న సమయంలో అమిత్ షా అరెస్టయిన అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ లేవనెత్తారు. దీన్ని అమిత్ షా ఖండించారు. అరెస్టుకు ముందే నైతిక కారణాలతో తాను రాజీనామా చేశానని, కోర్టు నిర్దోషిగా ప్రకటించాకే ప్రభుత్వంలో చేరానని చెప్పారు.
తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ నాయకులు రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో కొనసాగడం తగదని అమిత్ షా అన్నారు. అయినా ఆ మూడు బిల్లులకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. స్పీకర్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా సభ్యులు పట్టించుకోలేదు. దాంతో సభను ముందుగా మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో సాయంత్రం 5 గంటల వరకు వాయిదా వేశారు.
Read More >>
ఒక్కసారిగా కుప్పకూలిన భవనం.. ముగ్గురు దుర్మరణం
పార్టీ ఏర్పాటు ఆలోచనలకు బ్రేక్.. ఎలాన్ మస్క్ యూటర్న్..!
భారీ వర్షం.. నాలుగు గంటల రెస్క్యూ ఆపరేషన్.. మోనో రైలులో చిక్కుకున్న 582 మంది సురక్షితం
1971 నుంచి అదే దుర్మార్గపు ధోరణి.. పాకిస్థాన్పై భారత్ ఫైర్
ఎన్డీఏ తరఫు ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ నామినేషన్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

