IND vs PAK | 1971 నుంచి అదే దుర్మార్గపు ధోరణి.. ఐరాస వేదికగా పాకిస్థాన్‌పై భారత్ ఫైర్
IND vs PAK | భారత్ (India) ఐక్యరాజ్యసమితి (UNO) భద్రతామండలి (Security council) వేదికగా దాయాది పాకిస్థాన్ (Pakistan) పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. మహిళలపై లైంగిక హింస విషయంలో పాకిస్థాన్ సిగ్గుమాలిన రికార్డును కలిగి ఉందని, అలాంటి దేశం మానవ హక్కుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఘాటుగా విమర్శించింది.
IND vs PAK : భారత్ (India) ఐక్యరాజ్యసమితి (UNO) భద్రతామండలి (Security council) వేదికగా దాయాది పాకిస్థాన్ (Pakistan) పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. మహిళలపై లైంగిక హింస విషయంలో పాకిస్థాన్ సిగ్గుమాలిన రికార్డును కలిగి ఉందని, అలాంటి దేశం మానవ హక్కుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఘాటుగా విమర్శించింది. ఇరుదేశాల నడుమ సంఘర్షణ ప్రాంతాల్లో లైంగిక హింస బాధితులకు సహాయంపై జరిగిన చర్చలో పాకిస్థాన్ ప్రతినిధి అసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ (Asim Iftikar Ahmed) అనవసరంగా కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంతో భారత్ ధీటుగా బదులిచ్చింది.
భారత శాశ్వత ప్రతినిధి బృందం తరఫున ఎల్డోస్ మాథ్యూ పున్నూస్ మాట్లాడుతూ.. 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్ధ సమయంలో పాకిస్థాన్ సైన్యం మహిళలపై జరిపిన అఘాయిత్యాలను గుర్తుచేశారు. ‘1971లో తూర్పు పాకిస్థాన్‌లో పాక్ సైన్యం మహిళలపై జరిపిన ఘోరమైన లైంగిక నేరాలు చరిత్రలో ఒక సిగ్గుచేటు అయిన రికార్డు. దాదాపు నాలుగు లక్షల మంది మహిళలు వారి అరాచకాలకు బలయ్యారు’ అని అన్నారు.
ఆనాటి దుర్మార్గపు ధోరణి నేటికీ పాకిస్థాన్‌లో శిక్షార్హమైన రీతిలో నిరాటంకంగా కొనసాగుతోందని ఎల్డోస్ ఆరోపించారు. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారే నేడు న్యాయం గురించి మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. వారి ద్వంద్వ నీతి, కపటత్వం స్పష్టంగా కనిపిస్తున్నాయని పున్నూస్ ఎద్దేవా చేశారు. పాకిస్థాన్‌లో మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు, బాలికలపై కిడ్నాప్‌లు, బలవంతపు మత మార్పిడులు, లైంగిక హింస, గృహ హింస వంటివి నిరంతరం జరుగుతున్నాయని గుర్తుచేశారు.
ఈ విషయాలను ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం నివేదికలే ధ్రువీకరిస్తున్నాయని ఎల్డోస్ చెప్పారు. బలూచిస్థాన్‌లో మహిళల హక్కుల కోసం జరుగుతున్న పోరాటంలో భాగంగా ‘ఔరత్ మార్చ్’లో పాల్గొన్న వారిని సైతం బలవంతంగా మాయం చేయడం, చిత్రహింసలకు గురిచేయడం వంటి ఘటనలను ఐరాస నివేదికలు ప్రస్తావించాయని ఎల్డోస్ పున్నూస్ సభ దృష్టికి తెచ్చారు. మానవ హక్కులపై కబుర్లు చెప్పే పాకిస్థాన్ ముందుగా ఆ దేశంలో మహిళలు, మైనారిటీల భద్రతపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.
Read More >>
ఎన్డీఏ తరఫు ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ నామినేషన్
ఆఫ్ఘానిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 71 మంది వలసదారులు సజీవహదహనం
కాటేస్తున్న కరెంటు తీగలు.. వారం రోజుల్లో 11 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్‌లో వరుసగా రెండు భూకంపాలు.. భయాందోళనలో చంబా ప్రజలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IMD Weather | ఈ నెలలోనూ ఎండలెక్కువే..! చలి తీవ్రత పెరగాల్సిన సమయంలో భిన్న వాతావరణం
Omar Abdullah | జమ్ము కశ్మీర్ సీఎంపై 24 మంది ఎమ్మెల్యేల అసంతృప్తి.. నలుగురు మంత్రులు, సీఎం సలహాదారును తొలగించాలని డిమాండ్
Illegal Egg Donation | ఒక్కో అండం రూ. 3 లక్షలు..! డబ్బు ఆశ చూపి వ్యాపారం.. హాస్టళ్ల ముసుగులో దందా
Narsingi Big Road | ఒక్క బిల్డర్ కోసం మాపై బుల్డోజరా?.. ప్రభుత్వం తీరుపై భగ్గుమన్న ‘బిగ్’ రోడ్ బాధితులు
IDBI Bank | అగ్గువకు ఐడీబీఐ..! నిరుడు బ్యాంక్ లాభం 10 వేల కోట్లు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

