Afghanistan | ఆఫ్ఘానిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 71 మంది వలసదారులు సజీవహదహనం
Afghanistan | ఆఫ్ఘానిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇరాన్ నుంచి తరలిపోతున్న వలసదారులు వెళ్తున్న బస్సు హెరాత్ ప్రావిన్స్‌లో ఓ ట్రక్కును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 71 మంది వలసదారులు సజీవ దహనమయ్యారు.
Afghanistan | ఆఫ్ఘానిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇరాన్ నుంచి తరలిపోతున్న వలసదారులు వెళ్తున్న బస్సు హెరాత్ ప్రావిన్స్‌లో ఓ ట్రక్కును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 71 మంది వలసదారులు సజీవ దహనమయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల బహిష్కరణకు గురైన ఆఫ్ఘానిస్తాన్ వలసదారులను ఇరాన్ ఇటీవల బలవంతంగా వెనక్కి పంపించింది. వారిలో కొంతమందితో వస్తున్న బస్సు ఆఫ్ఘానిస్థాన్‌లోని హెరాత్ ప్రావిన్స్‌కు వచ్చిన తర్వాత ముందుగా ఓ మోటార్ సైకిల్‌ను ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పి ఇంధనం తీసుకెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి.
ప్రమాదం గురించి తెలియగానే అధికారులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కానీ అప్పటికే పెను ప్రమాదం జరిగిపోయింది. ఈ ఘటనలో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 17 మంది చిన్నారులు ఉండటం గమనార్హం. ట్రక్కులోని ఇద్దరు, మోటార్ సైకిల్‌పై ఉన్న ఇద్దరితో కలిపి బస్సులోని ప్రయాణిస్తున్న వారు ఈ ప్రమాదంలో మరణించారు. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో కేవలం ముగ్గురు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. నిర్లక్ష్యం, అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదంపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు అధికారులు తెలిపారు.
د اطفايې مسؤلين په ډير ليږ وخت کي د حادثی ځای ته ورسيدل خو متاسفانه په ژغورلو ونه توانيدل pic.twitter.com/cj3RhQc25H
— Ahmadullah Muttaqi | احمدالله متقي (@Ahmadmuttaqi01) August 19, 2025
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

