CRPF | జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir)లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉదంపూర్ (Udhampur) జిల్లా కద్వా బసంత్‌గఢ్ (Kandva Basantgarh) ప్రాంతంలో సీఆర్పీఎఫ్ (CRPF) జవాన్లు వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. సుమారు 12 మంది గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు ఉదంపూర్ అడిషనల్ ఎస్పీ సందీప్ భట్ తెలిపారు. ప్రమాద సమయంలో వాహనంలో 23 మంది జవాన్లు ఉన్నట్లు చెప్పారు.
Also Read..
Pak army chief | భారత్‌తో టారిఫ్ ఉద్రిక్తతల వేళ.. మరోసారి అమెరికాకు పాక్ ఆర్మీ చీఫ్
Trump Tariffs | భారత్‌పై సెకండరీ శాంక్షన్స్.. హెచ్చరించిన ట్రంప్