Pak army chief | భారత్‌తో టారిఫ్ ఉద్రిక్తతల వేళ.. మరోసారి అమెరికాకు పాక్ ఆర్మీ చీఫ్
Pak army chief | ప్రతీకార సుంకాల నేపథ్యంలో భారత్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాషింగ్టన్‌తో పాకిస్థాన్ సంబంధాలు బలపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Pak army chief | ప్రతీకార సుంకాల నేపథ్యంలో భారత్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాషింగ్టన్‌తో పాకిస్థాన్ సంబంధాలు బలపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పాకిస్థాన్ ఆర్మీ ఫీల్డ్ మార్షల్ (Pak army chief) సయ్యద్ అసిం మునీర్ మరోసారి అమెరికా పర్యటనకు వెళ్లబోతున్నారు. ఈ విషయాన్ని పాక్ మీడియా వెల్లడించింది. ఈ నెలలో సెంట్రల్ కమాండ్ (CENTCOM) జనరల్ కురిల్లా పదవీ విరమణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మునీర్ వాషింగ్టన్ వెళ్తున్నట్లు సమాచారం.
కాగా, అసిం మునీర్ (Asim Munir) యూఎస్ సందర్శనకు వెళ్లడం రెండు నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈఏడాది జూన్‌లో అసిం మునీర్ అమెరికాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ట్రంప్ వైట్ హౌస్‌లో మునీర్‌కు ప్రత్యేకంగా విందు కూడా ఇచ్చారు.
భారత్‌పై అధిక సుంకాలు, పెనాల్టీలు విధించిన ట్రంప్.. పాకిస్థాన్‌తో (Pakistan) జట్టుకట్టారు. ఆ దేశంతో వాణిజ్య ఒప్పందం (Trade Deal) చేసుకున్నట్లు వెల్లడించారు. పాక్‌తో భారీ చమురు నిల్వల అభివృద్ధికి ఒప్పందం కుదిరినట్లు ప్రకటించారు. భారత్‌కు పాకిస్థాన్ ఏదో ఒక రోజు చమురు విక్రయించవచ్చని వెల్లడించారు. భాగస్వామ్యానికి నాయకత్వం వహించే చమురు కంపెనీని ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతున్నదని తన సామాజిక మాధ్యమం ట్రూత్ వేదికగా తెలిపారు.
Also Read..
TCS | ఉద్యోగులకు టీసీఎస్ తీపి కబురు.. 80 శాతం ఉద్యోగుల వేతనాలు పెంపు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

