TCS | పెద్ద ఎత్తున ఉద్యోగులకు ( Employees) లేఆఫ్స్ ప్రకటించి షాకిచ్చిన భారత్లోని అతి పెద్ద ఐటీ సర్వీసుల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇప్పుడు తీపి కబురు చెప్పింది. దాదాపు 80 శాతం ఉద్యోగుల వేతనాలను పెంచుతున్నట్లు (wage hikes) తెలిపింది. టీసీఎస్ తాజా నిర్ణయంతో జూనియర్, మధ్య స్థాయి (సీ3ఏ గ్రేడ్ వరకు) ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. సెప్టెంబర్ 1 నుంచి వేతన పెంపులను అమలు చేయనున్నట్టు ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్లో టీసీఎస్ సీహెచ్ఆర్వో మిలింద్ లక్కడ్ తెలిపారు.
కాగా, ఇటీవలే టీసీఎస్ పెద్ద ఎత్తున లేఆఫ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తన మొత్తం ఉద్యోగుల్లో 2 శాతం మందికి ఉద్వాసన పలకనున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది కల్లా దాదాపు 12,200 మంది ఉద్యోగులపై దీని ప్రభావం పడనున్నది. మధ్య స్థాయి, సీనియర్ స్థాయి ఉద్యోగులపై అధికంగా వేటు పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కే కృతివేశన్ మనీకంట్రోల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. లేఆఫ్స్ ప్రకటన వేళ కంపెనీ జీతాల పెంపు నిర్ణయం ఉద్యోగులకు ఊరటనిచ్చే అంశమనే చెప్పాలి.
Also Read..
దేశ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చిత పరిస్థితులు.. వడ్డీరేట్ల కోతలకు బ్రేక్