హైదరాబాద్, ఆగస్టు 6 : హైదరాబాద్కు చెందిన షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ, సోలార్ పీవీ మ్యాన్యుఫ్యాక్చరర్ ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ప్రవేశించాలని చూస్తున్నది. ఈ క్రమంలోనే వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు యోచిస్తున్నట్టు తెలుస్తున్నది.
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నడుస్తున్న 1 గిగావాట్ లైన్ పనులు పూర్తయితే ఐపీవోకు రంగం సిద్ధం కానున్నది. ఇండోసోల్.. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటీవ్ (పీఎల్ఐ) స్కీమ్ కింద గుర్తింపును పొందినట్టు షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ సీఎండీ ఎన్ విశ్వేశ్వర రెడ్డి తెలిపారు. రెండు విడుతల్లో మొత్తం రూ.5,175 కోట్ల ప్రోత్సాహకాలు అందుకున్నట్టు చెప్పారు.