Donald Trump | టారిఫ్‌ల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. భారత్ సహా పలు దేశాలపై సుంకాల మోత మోగించారు. ట్రంప్ విధించిన అదనపు సుంకాలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో సుంకాల విషయంలో తన చర్యను ట్రంప్ సమర్థించుకున్నారు. కొన్ని ఏళ్లుగా యూఎస్ నుంచి ప్రయోజనాలు పొందిన దేశాల నుంచి బిలియన్ డాలర్లు తిరిగి వెనక్కి రానున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో పోస్టు పెట్టారు.
‘పరస్పర సుంకాలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. చాలా ఏళ్ల తరబడి కొన్ని దేశాలు అమెరికా నుంచి ప్రయోజనం పొందాయి. ఆయా దేశాల నుంచి ఇప్పుడు యూఎస్‌కు బిలియన్ల కొద్దీ డాలర్లు వెనక్కి తిరిగిరానున్నాయి’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో పోస్టు పెట్టారు.
భారత్‌పైనే అధిక సుంకాలు!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్‌పై సుంకాల మోత మోగిస్తున్నారు. చైనా, కెనడా కంటే అధికంగా భారత్‌పై టారిఫ్‌లు విధించారు. అమెరికా అత్యధికంగా విధించిన సుంకాల జాబితాలో బ్రెజిల్‌తో కలిసి భారత్ సంయుక్తంగా మొదటిస్థానంలో ఉన్నది. ఇరు దేశాలపై ట్రంప్ 50 శాతం టారిఫ్ విధించారు. ఆ తర్వాత స్థానాల్లో స్విట్జర్లాండ్(39 శాతం), కెనడా, ఇరాక్ (35 శాతం చొప్పున), చైనా (30 శాతం) నిలిచాయి.
కాగా, ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వు 69 దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 10 శాతం నుంచి 41 శాతం వరకు ప్రతీకార సుంకాలను విధించింది. ఈ కొత్త రేట్లు ఆగస్టు 7 నుంచి అమలులోకి వస్తాయి. మెక్సికోతో గతంలో కుదుర్చుకున్న 90 రోజుల ఒప్పందం ముగియడానికి కొన్ని గంటల ముందే ఈ ఆర్డర్ జారీ అయింది. దీని ప్రకారం ఆగస్టు 7 నుంచి మెక్సికోపై అదనపు సుంకాలు అమలులోకి వస్తాయి.
బ్రెజిల్‌పై గతంలో విధించిన 40 శాతం సుంకం ఆగస్టు 1న అమలులోకి రాగా తాజాగా 10 శాతం ప్రతీకార సుంకాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జేర్ బోల్సోనారో ప్రాసిక్యూషన్‌కు అభ్యంతరం తెలియచేస్తూ బ్రెజిల్‌పై సుంకాన్ని ట్రంప్ విధించారు. కెనడాపై విధించిన 35 శాతం సుంకం ఆగస్టు 1న అమలులోకి వచ్చింది.
Also Read..
Pak army chief | భారత్‌తో టారిఫ్ ఉద్రిక్తతల వేళ.. మరోసారి అమెరికాకు పాక్ ఆర్మీ చీఫ్
Trump Tariffs | భారత్‌పై సెకండరీ శాంక్షన్స్.. హెచ్చరించిన ట్రంప్
మరో 25 శాతం బాదుడు.. చైనా కంటే మనపైనే ట్రంప్ అధిక సుంకాలు