Rahul Gandhi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ (ceasefire)కు తాను మధ్యవర్తిత్వం వహించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పదేపదే చెప్పుకుంటున్నప్పటికీ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రం మౌనం వీడట్లేదంటూ విమర్శించారు. ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్రం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పార్లమెంట్ వెలుపల విలేకరులతో రాహుల్ మాట్లాడుతూ.. ‘భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ చేయించింది నేనే అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 25 సార్లు చెప్పారు. కాల్పుల విరమణ చేయించడానికి అసలు ట్రంప్ ఎవరు..? అది ఆయన పని కాదు. కానీ, ఈ విషయంపై ప్రధాని ఒక్కసారి కూడా సమాధానం ఇవ్వలేదు. మౌనంగా ఉంటున్నారు. ఎందుకంటే అదే నిజం కాబట్టి’ అని వ్యాఖ్యానించారు.
Also Read..
India – Pak War | భారత్-పాక్ వివాదంపై పాతపాటే ఎత్తుకున్న అమెరికా.. దీటుగా జవాబిచ్చిన భారత్
Monsoon Session | మూడో రోజూ దద్దరిల్లిన ఉభయసభలు.. ఎలాంటి చర్చా లేకుండానే రేపటికి వాయిదా