India – Pak War | భారత్-పాక్ వివాదంపై పాతపాటే ఎత్తుకున్న అమెరికా.. దీటుగా జవాబిచ్చిన భారత్
India – Pak War | భారత్-పాక్ విషయంలో (India – Pak War) అగ్రరాజ్యం అమెరికా (America) మళ్లీ పాతపాటే ఎత్తుకుంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల తగ్గింపులో అమెరికా పాత్ర కీలకమని పేర్కొంది.
India – Pak War | భారత్-పాక్ విషయంలో (India – Pak War) అగ్రరాజ్యం అమెరికా (America) మళ్లీ పాతపాటే ఎత్తుకుంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల తగ్గింపులో అమెరికా పాత్ర కీలకమని పేర్కొంది. అంతర్జాతీయ శాంతి, భద్రతల అంశంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో (UN Security Council) జరిగిన ఉన్నత స్థాయి చర్చలో అమెరికా రాయబారి డోరతీ షియా ఈ మేరకు వ్యాఖ్యానించారు. గత మూడు నెలల్లో ఇజ్రాయెల్-ఇరాన్, భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల తగ్గింపులో అమెరికా కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.
‘ప్రపంచవ్యాప్తంగా వివాదాలకు మధ్యవర్తిత్వం వహించడం, శాంతియుత పరిష్కారాలను ముందుకు తీసుకెళ్లడంలో అమెరికా నిబద్ధతతో ఉంది. ఇటీవలే భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన కీలక పాత్ర పోషించింది’ అని యూఎన్ భద్రతా మండలి బహిరంగ చర్చలో వ్యాఖ్యానించారు. అమెరికా వాదనపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు ఐరాస భద్రతా మండలిలో భారత శాశ్వత రాయబారి పర్వతనేని హరీష్ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం అనేది కేవలం భారత్, పాకిస్థాన్ మధ్య నేరుగా జరిగిన సైనిక చర్చల ఫలితమేనని స్పష్టం చేశారు. పాక్ అభ్యర్థన మేరకే కాల్పుల విరమణకు అంగీకరించినట్లు వెల్లడించారు. ఈ వివాదంలో ఎవరి ప్రమేయం లేదని.. ఇదే విషయాన్ని అమెరికాకు కూడా ఇప్పటికే స్పష్టంగా చెప్పినట్లు భారత రాయబారి గుర్తు చేశారు.
Also Read..
Vice President | ధన్‌ఖడ్ రాజీనామా.. ఉపరాష్ట్రపతి రేసులో నితీశ్, థరూర్..?
Airspace | పాక్ విమానాలకు గగనతల నిషేధం మరోసారి పొడిగింపు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

