UNSC | ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో దాయాది పాకిస్థాన్ (Pakistan)పై భారత్ (India) మరోసారి విరుచుకుపడింది. పాక్ మతోన్మాదం, ఉగ్రవాదంలో మునిగిపోయిందని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ (Parvathaneni Harish)విమర్శించారు. భారత ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుంటే.. పాక్ మాత్రం అంతర్జాతీయ సంస్థల నుంచి వరుసగా అప్పులు తీసుకోవడంలో బిజీగా మారిందని వ్యాఖ్యానించారు.
అంతర్జాతీయ శాంతి, భద్రతను ప్రోత్సహించడం, ద్వైపాక్షిక చర్చల ద్వారా వివాదాల పరిష్కారం అనే అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ)లో ఉన్నత స్థాయి చర్చ జరిగింది. ఈ చర్య సందర్భంగా ఇస్లామాబాద్ కశ్మీర్ అంశం, సింధు జలాల ఒప్పందం అంశాలను ప్రస్తావించింది. అంతర్జాతీయ వేదికపై భారత్‌ను నిందించే ప్రయత్నం చేసింది. దీంతో పాక్ వ్యాఖ్యలకు భారత ప్రతినిధి హరీష్ దీటుగా బదులిచ్చారు. ‘భారత్.. పరిణితి చెందిన ప్రజాస్వామ్య దేశం. సమగ్ర భద్రత, స్థిరత్వంతో బలమైన ఆర్థిక వ్యవస్థ దిశగా దూసుకెళ్తోంది. పాకిస్థాన్ మాత్రం ఉన్మాదం, ఉగ్రవాదంతో మునిగిపోయింది. ఐఎంఎఫ్ (IMF) నుంచి పదేపదే రుణాలు తీసుకోవడంలో బిజీగా ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు.
Also Read..
Gaza | గాజాలో కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు.. 20 మంది పాలస్తీనియన్లు మృతి
11 వేల యూట్యూబ్ చానళ్లను తొలగించిన గూగుల్