వాషింగ్టన్: వివిధ దేశాలకు సంబంధించి అసత్య ప్రచారాలను వ్యాప్తి చేస్తున్నాయని ఆరోపిస్తూ గూగుల్ 11వేల యూట్యూబ్ చానళ్లను తొలగించింది. వీటిలో చైనా, రష్యాకు చెందిన చానల్స్ టాప్ లిస్ట్‌లో ఉన్నట్టు వెల్లడించింది. తొలగించిన వాటిలో కేవలం చైనాకు సంబంధించినవే 7,700 యూట్యూబ్ చానల్స్ ఉన్నట్టు తెలిపింది.
అవి భారత్‌లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా పార్టీకి సంబంధించి ప్రచారాలు చేస్తున్నాయని, ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ప్రశంసిస్తూ పలు కంటెంట్లను పోస్టు చేస్తున్నాయని ఆరోపించింది. రష్యాకు చెందిన 2,000లకు పైగా యూట్యూబ్ చానళ్లు, ఇతర వెబ్సైట్లను తొలగించినట్టు గూగుల్ వెల్లడించింది. ఈ ఖాతాల్లో ఉక్రెయిన్, నాటోలను విమర్శిస్తూ.. రష్యాకు మద్దతిచ్చేలా సందేశాలను వ్యాప్తి చేస్తున్నట్టు గుర్తించామని పేర్కొన్నది.