Gaza | హమాస్ మిలిటెంట్ల ఏరివేతే లక్ష్యంగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తోంది. గాజా (Gaza)లోని పలు ప్రాంతాలపై వైమానిక దాడులతో (Israeli airstrikes) విరుచుకుపడుతోంది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 20 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. గాజా నగరానికి పశ్చిమాన సముద్ర తీరాన ఉన్న శణార్థి శిబిరంలో ఆశ్రయం పొందుతున్న ప్రజలపై ఇజ్రాయెల్ దాడి జరిపినట్లు పేర్కొన్నారు.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం అక్టోబర్ 2023లో ప్రారంభమైన విషయం తెలిసిందే. హమాస్ ఇజ్రాయెల్‌లోని అనేక ప్రాంతాలపై దాడి చేసింది. ఈ దాడుల్లో 1200 మందికిపైగా ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకారంలో ఇప్పటివరకు 59 వేలకుపైగా పాలస్తీనియన్లు మరణించారు. గాజాలో పెద్ద సంఖ్యలో జనాభా నిరాశ్రయులయ్యారు. వేలాది మంది ఆకలి బాధలను ఎదుర్కొంటున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 88 మంది ఆకలి బాధతో మరణించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
Also Read..
11 వేల యూట్యూబ్ చానళ్లను తొలగించిన గూగుల్
ఐఎంఎఫ్‌ను వీడుతున్న గీతా గోపీనాథ్.. హార్వర్డ్ వర్సిటీలో ప్రొఫెసర్‌గా చేరిక