Vice President | దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉప రాష్ట్రపతి (Vice President) జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు. మరో రెండేండ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ ఆయన కుర్చీని ఖాళీచేశారు. ఆరోగ్య కారణాలను పేర్కొంటూ రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. దీంతో ఆయన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ఆయన రాజీనామాతో దేశంలో అత్యున్నత స్థానం ఖాళీ అయ్యింది. ఈ నేపథ్యంలో తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరనే (Next Vice President) అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతున్నది. అధికార పార్టీ పలువురి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి.
అందులో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar), కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. నిశీత్ కుమార్ కొన్నేళ్లపాటూ బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అయితే, త్వరలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ఇక ఆయన్ని సీఎం కుర్చీ నుంచి తప్పించి కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో నిశీత్ కూడా ఉపరాష్ట్రపతి పదవి ఆశిస్తున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన పేరు తెరపైకి వచ్చింది.
ఇక కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ గత కొంతకాలంగా కేంద్రంలోని బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చర్యలను సమర్థిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. దీంతో సొంత పార్టీ నేతలే ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయినా అవేవీ పట్టించుకోకుండా విమర్శలకు దీటుగా బదులిస్తున్నారు. త్వరలో ఆయన హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పి కమలం పార్టీతో జతకట్టే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం వేళ ఉపరాష్ట్రపతి పదవికి ఆయన పేరు తెరపైకి వచ్చింది.
వీరితోపాటు జనతాదళ్ (యునైటెడ్) ఎంపీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ (Harivansh Narayan Singh) కూడా ఉపరాష్ట్రపతి రేసులో ఉన్నారు. ఇద్దరు లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా లేదంటే ఢిల్లీ ఎల్జీ సక్సేనాలో ఎవరికో ఒకరికి అవకాశం ఇవ్వనున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో తీవ్రంగా చర్చనడుతస్తోంది. అయితే, దీనిపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Also Read..
IIT Guwahati: పెరిగిన బోధన ఫీజులు తగ్గించాలని డిమాండ్.. ఐఐటీ గౌహతిలో విద్యార్థుల నిరసన
Airspace | పాక్ విమానాలకు గగనతల నిషేధం మరోసారి పొడిగింపు