Aircraft Crash | మహారాష్ట్రలో ప్రమాదం చోటు చేసుకుంది. పూణె (Pune) జిల్లాలోని బారామతి విమానాశ్రయం (Baramati airport) సమీపంలో శనివారం ఉదయం ఓ శిక్షణ విమానం (Training aircraft) ప్రమాదానికి గురైంది. అయితే, అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 8 గంటల సమయంలో శిక్షణ విమానం గాల్లో ఉండగా అందులోని టైర్లలో ఒకటి దెబ్బతిన్నట్లు పైలట్ గుర్తించారు. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ల్యాండింగ్ తర్వాత ముందు చక్రం ఊడిపోయింది. దీంతో విమానం ట్యాక్సీవే నుంచి అదుపుతప్పి ఎయిర్పోర్ట్ అవతలివైపుకు దూసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని చెప్పారు. ఈ ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డట్లు వివరించారు.
Also Read..
Pakistan | భారత్ విమానాలకు గగనతలం మూసివేత.. రెండు నెలల్లోనే పాక్‌కు రూ.400 కోట్ల నష్టం
Indian Railways | గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. రిటర్న్ టికెట్‌పై 20% డిస్కౌంట్
Air Force Chief | ఆపరేషన్ సిందూర్‌లో ఐదు పాక్ యుద్ధ విమానాలను కూల్చేశాం : ఎయిర్ ఫోర్స్ చీఫ్