హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): వైద్యం కోసం రోగి దవాఖానకు వస్తే సహాయకుడు లేడని చెప్పి వైద్యం చేయరా? రోగికి ఆధార్‌కార్డు లేకుంటే వైద్యసాయం అందించరా? అంటూ హైకో ర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, వైద్య విద్యా డైరెక్టర్, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్/సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్లకు నో టీసులు జారీచేసింది.
విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం జయరాం గ్రామానికి చెందిన రవి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ సివిల్ హాస్పిటల్‌కు వెళ్తే సహాయకుడు లేడని, ఆధార్‌కార్డు కూడా లేదని చెప్పి వైద్యం చేసేందుకు నిరాకరించారని పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా న్యాయవాది కొమురయ్య రాసిన లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపిం ది.
రవికి చికిత్స అందించడంలో తాత్సా రం జరిగిందని, ఆ తర్వాత చనిపోయాడని భావించిన దవాఖాన సిబ్బంది మార్చురీకి తరలించారని పేర్కొన్నారు. మరుసటి రో జు పారిశుధ్య సిబ్బంది రోగిలో కదలికలను గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారు. ఆధార్‌కార్డు లేదన్న కారణంగా వైద్యం చేయడానికి నిరాకరించడం పౌరుడి ప్రాథమిక హకులను కాలరాయడమేనని అన్నారు. వాదనల అనంతరం హైకోర్టు.. ప్రభుత్వ విధానం ఏమిటో వివరించాలని ఆదేశించింది. విచారణను మా ర్చి 18కి వాయిదా వేసింది.