హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): పుట్‌పాత్‌ల ఆక్రమణల వల్ల ప్రమాదాలు ఎకువగా జరుగుతున్నాయ ని హైకోర్టు అభిప్రాయపడింది. ఆక్రమణల తొలగింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదని తప్పుపట్టింది. నిజం చెప్పాలం టే హైదరాబాద్‌లో అత్యధిక శాతం ప్రాం తాల్లో ఫుట్‌పాత్‌లు లేవని వ్యాఖ్యానించిం ది. పన్ను చెల్లించే ప్రజలు నడిచి వెళ్లేందుకు ఫుట్‌పాత్‌లు సరైన రీతిలో లేవని ఎత్తిచూపింది.
విధిలేని పరిస్థితుల్లో రోడ్లపై నడు స్తూ ప్రమాదాలబారిన పడుతున్నారని ఆం దోళన వ్యక్తంచేసింది. పన్నులు ఎలా రాబట్టాలనే ధ్యాస మాత్రమే అధికారుల్లో ఉం టున్నదని వ్యాఖ్యానించింది. బాగ్‌లింగంపల్లిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు జీహెచ్ఎంసీ ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ ఇందుమతి అనే మహిళ వేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ఇటీవల విచారణ జరిపారు. హౌసింగ్ బోర్డు నుం చి ఆ స్థలాన్ని 2010లో కొనుగోలు చేసినప్పటి నుంచి అదే చోట వ్యాపారం పిటిషనర్ చేస్తున్నదని ఆమె తరఫు న్యాయవాది చెప్పారు. నివాస స్థలాన్ని వాణిజ్య పరిధిలోకి మార్చడం కూడా జరిగిందని తెలిపా రు.
దీనికి జీహెచ్ఎంసీ న్యాయవాది వా దిస్తూ, ఫిర్యాదు ఆధారంగా ఆక్రమణలను గుర్తించినట్టు చెప్పారు. పిటిషనర్ 700 గజాల స్థలాన్ని కొనుగోలు చేస్తే ఫుట్‌పాత్ ఆక్రమణలతో అది 1052 చదరపు గజాలకు పెరిగిందని తెలిపారు. వాదనలపై స్పందించిన హైకోర్టు.. జీహెచ్ఎంసీ నోటీసులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిం ది. ఆక్రమణల తొలగింపుపై మూడు నెలల్లోగా రిజిస్ట్రీకి జీహెచ్ఎంసీ నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ.. పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ తీర్పు చెప్పింది.