Air Force Chief | ఆపరేషన్ సిందూర్‌లో ఐదు పాక్ యుద్ధ విమానాలను కూల్చేశాం : ఎయిర్ ఫోర్స్ చీఫ్
Air Force Chief | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ సమయంలో ఐదు పాక్ యుద్ధ విమానాలను (Five Pakistani fighter jets) కూల్చేసినట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తాజాగా వెల్లడించింది.
Air Force Chief | పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ సమయంలో ఐదు పాక్ యుద్ధ విమానాలను (Five Pakistani fighter jets) కూల్చేసినట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తాజాగా వెల్లడించింది. వాటితోపాటు రెండు వైమానిక స్థావరాలను కూడా ధ్వంసం చేసినట్లు ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ (AP Singh) తాజాగా వెల్లడించారు.
బెంగళూరులో ఎయిర్ మార్షల్ కాత్రే వార్షిక వేడుకలో పాల్గొన్న ఎయిర్ చీఫ్ మార్షల్ ఈ సందర్భంగా మాట్లాడారు. ‘పక్కా ప్రణాళికతో ఆపరేషన్ సిందూర్ నిర్వహించాం. ఈ ఆపరేషన్‌తో పాక్‌కు స్పష్టమైన సందేశాన్నిచ్చాం. సిందూర్ సమయంలో పాక్‌కు చెందిన ఐదు ఫైటర్‌జెట్స్‌ను కూల్చేశాం. వాటితోపాటు ఓ పెద్ద విమానాన్ని కూడా కూల్చేశాం. రెండు వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాం. మన S-400 రక్షణ వ్యవస్థ, డ్రోన్ వ్యవస్థలు సమర్థవంతంగా పని చేశాయి’ అని ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్ తెలిపారు. పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా భారత్ చేపట్టిన ఆపరేషన్‌లో పాక్‌లోని బహవల్పూర్లో గల జైషే ఉగ్రసంస్థ ధ్వంసమైన ఫొటోలను కూడా ప్రదర్శించారు. దాడికి ముందు దాడి తర్వాత దృశ్యాలను మీడియాకు చూపించారు.
#WATCH | Bengaluru, Karnataka | Speaking on Operation Sindoor, Chief of the Air Staff, Air Chief Marshal AP Singh says, “…We have at least five fighters confirmed kills and one large aircraft, which could be either an ELINT aircraft or an AEW &C aircraft, which was taken on at… pic.twitter.com/ieL6Gka0rG
— ANI (@ANI) August 9, 2025
పహల్గాం ఉగ్రదాడిలో భారత ఆడపడుచుల సిందూరాన్ని తుడిచేసిన ముష్కర మూకలకు ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట భారత సైన్యం గట్టిగా బదులిచ్చింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని తొమ్మిది ఉగ్ర శిబిరాలపై అత్యంత కచ్చితత్వంతో మెరుపు దాడులు చేసింది. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపు దూరంలో జరిగిన ఈ దాడుల్లో 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు. 1971 యుద్ధం తర్వాత త్రివిధ దళాలు సంయుక్తంగా నిర్వహించిన అతిపెద్ద జాయింట్ ఆపరేషన్ ఇదే.
Also Read..
Operation Akhal | కుల్గామ్‌లో ఎదురు కాల్పులు.. ఇద్దరు సైనికులు మృతి
Ajit Doval | రష్యా ఉప ప్రధానితో అజిత్ దోవల్ భేటీ.. మిలిటరీ-సాంకేతిక ఒప్పందాలపై ద్వైపాక్షిక చర్చలు
ICICI Bank: ఐసీఐసీఐ మీనిమం బ్యాలెన్స్ ఇక నుంచి 50 వేలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

