ICICI Bank: ఐసీఐసీఐ మీనిమం బ్యాలెన్స్ ఇక నుంచి 50 వేలు
ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ కనీస బ్యాలెన్స్‌ను పెంచేసింది. కనీస బ్యాలెన్స్‌ను 50వేలు చేసింది. మెట్రో, అర్బన్ లొకేషన్లలో ఉన్న కొత్త కస్టమర్లకు ఈ రూల్ వర్తించనున్నది.
న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంక్(ICICI Bank) ప్రతి నెలా కనీస బ్యాలెన్స్‌ను పెంచేసింది. కొత్త కస్టమర్లకు ఈ రూల్ వర్తించనున్నది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఇది అమలులోకి వస్తోంది. మెట్రో, అర్బన్ లొకేషన్లలో ఉన్న కస్టమర్లు.. తమ సేవింగ్స్ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్‌ను 50 వేలు మెయింటేన్ చేయాల్సి ఉంటుంది. పెనాల్టీలు తప్పించుకోవాలంటే కనీస బ్యాలెన్స్ తప్పనిసరి అవుతుంది. బ్యాంక్ తన వెబ్సైట్లో ఈ తాజా సమాచారాన్ని పోస్టు చేసింది. అయితే పాత కస్టమర్లకు మాత్రం కనీస బ్యాలెన్స్ 10వేలు మాత్రమే ఉంచింది.
సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉన్న కొత్త కస్టమర్లకు.. కనీస బ్యాలెన్స్ 25వేలుగా ఫిక్స్ చేశారు. గ్రామీణ ప్రాంత కస్టమర్లకు దీన్ని 10వేలుగా నిర్ధారించారు. అయితే రూరల్ , సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉన్న పాత కస్టమర్లకు కనీస బ్యాలెన్స్ 5వేలుగా ఉంది. కనీస బ్యాలెన్స్ మెయింటేన్ చేయని వారు ఆరు శాతం ఫైన్ కట్టాల్సి ఉంటుంది.
సేవింగ్స్ ఖాతాలో మూడు సార్లు ఉచితంగా క్యాష్ డిపాజిట్ కోసం అవకాశం కల్పించారు. ఆ తర్వాత ప్రతి ట్రాన్జాక్షన్కు 150 చెల్లించాల్సి ఉంటుంది. కాంప్లిమెంటరీ క్యాష్ విత్‌డ్రాలను నెలకు మూడుసార్లు మాత్రమే చేశారు. సేవింగ్స్ అకౌంట్లో థార్డ్ పార్టీ క్యాష్ డిపాజిట్ ప్రతి ట్రాన్జాక్షన్కు 25వేలుగా ఫిక్స్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

