Train | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) మహానగరం ట్రాఫిక్‌కు (traffic jam) పేరుగాంచింది. వాహనాల ట్రాఫిక్‌తో ప్రయాణం నరకప్రాయంగా ఉండే నగరాల జాబితాలో బెంగళూరుది దేశంలోనే మొదటి స్థానం. ఇక్కడ తక్కువ దూరం ప్రయాణించడానికి గంటల సమయం పడుతుంది. దీంతో ప్రజలు తమ ట్రాఫిక్ కష్టాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంటారు. ఇక నగర రోడ్లపై నడిచే వాహనాలకే కాదు.. పట్టాలపై పరుగు పెట్టే చుక్ చుక్ రైళ్లకూ (Train) నగరంలో ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు.
ఇప్పటి వరకూ ట్రాఫిక్‌లో బస్సులు, కార్లు, బైకులు తదితర వాహనాలు మాత్రమే చిక్కుకుంటుండటం చూశాం. ఇప్పుడు ఆ జాబితాలో రైలు సైతం వచ్చి చేరింది. నగరంలో ఓ రైల్వే క్రాసింగ్ గేట్ వద్ద పలు వాహనాలు ముందు సాగుతున్నాయి. అందుకు కొద్ది దూరంలో ఓ రైలు పట్టాలపై ఆగి ఉంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ‘నువ్వు, నేను కాదు.. బెంగళూరు ట్రాఫిక్ నుంచి ఈ రైలు కూడా తప్పించుకోలేకపోయింది’ అంటూ సరదాగా చమత్కరించారు.
ఈ వార్త కాస్తా వైరల్ కావడంతో.. ఆగ్నేయ రైల్వే స్పందించింది. కేరళ వెళ్తున్న ఈ రైలులో సాంకేతిక లోపం తలెత్తిందని.. మున్నెకోళ్ల రైల్వే క్రాసింగ్ వద్ద రైలును నిలిపి లోకో పైలెట్ తనిఖీలు చేపట్టారని వివరణ ఇచ్చింది. అంతేకానీ ట్రాఫిక్ సమస్య కాదని ఆగ్నేయ రైల్వే స్పష్టం చేసింది. మంగళవారం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు వెల్లడించింది.
Also Read..
Devara | దేవర ఫీవర్‌ను క్యాష్ చేసుకుంటూ పోస్టర్లపై కొత్త నినాదం
PM Modi | ప్రధాని సమక్షంలో చెస్ ఆడిన ప్రజ్ఞానంద్, అర్జున్.. వీడియో వైరల్
Sanjay Raut | పరువు నష్టం కేసు.. ఎంపీ సంజయ్ రౌత్‌కు 15 రోజుల జైలు శిక్ష