Devara | వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం చాలా కాలంగా వార్తల్లో నిలుస్తున్న విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రైవేటీకరణను ఆపేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరుతూ.. ఏపీ చంద్రబాబుకు విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తోన్న దేవర (Devara) చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇండియాతోపాటు విదేశాల్లో కూడా దేవర ఫీవర్ నడుస్తుంది.
దేవర ఫీవర్‌ను క్యాష్ చేసుకుంటున్నారు ఏపీ వాసులు. దేవర వాల్ పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నినాదం రాసి ఉన్న స్టిక్కర్లను అతికిస్తున్నారు. ఇలాగైనా తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశాభావంతో ఏపీ జనాలు చేస్తున్న కొత్త ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నారు నెటిజన్లు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ఉద్దేశపూర్వకంగానే నష్టాల్లోకి నెట్టి అమ్మేసేందుకు కుట్రలు పన్నుతున్నట్టు ఇప్పటికే జోరుగా చర్చ నడుస్తోన్న విషయం తెలిసిందే.
Prakash Raj | గెలిచే ముందొకటి.. గెలిచిన తర్వాత ఇంకోటి.. పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్‌రాజ్ ఫైర్
Jani Master | రెండో రోజు విచారణ.. షూటింగ్ స్పాట్స్‌కు జానీ మాస్టర్.. !
Hanu Man | బాహుబలి, ఆర్ఆర్ఆర్ రూట్లో తేజ సజ్జా హనుమాన్.. ప్రశాంత్ వర్మ కొత్త పోస్టర్ వైరల్