Jani Master | డ్యాన్సర్‌పై లైంగిక దాడి కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master ) అరెస్టయ్యాడని తెలిసిందే. గోవాలో జానీ మాస్టర్‌ను అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసుల బృందం కోర్టులో హాజరుపరచగా.. రాజేంద్రనగర్ కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. జానీ మాస్టర్‌ను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ నార్సింగి పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. 4 రోజుల పోలీస్ కస్టడీకి రంగారెడ్డి జిల్లా ప్రత్యేక ఫోక్సో కోర్టు అనుమతించింది.
ఇప్పటికే తొలి రోజు విచారణ జరిపిన పోలీసులు.. రెండో రోజు జానీ మాస్టర్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. కాసేపట్లో జానీ మాస్టర్ రెండో రోజు విచారణ చేయనున్నారు. కేసులో కీలకమైన సాంకేతిక ఆధారాల కోసం ప్రయత్నిస్తున్న పోలీసులు.. అత్యాచారం చేసిన షూటింగ్ స్పాట్స్‌కు జానీని తీసుకెళ్లనున్నారు. నార్సింగి పోలీసులు లాయర్ సమక్షంలో జానీమాస్టర్‌ను ప్రశ్నించనున్నట్టు సమాచారం.
ఈ మేరకు నార్సింగి పీఎస్ నుంచి జానీ మాస్టర్‌ను తరలించిన పోలీసులు గోల్కొండ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కేసులో సాంకేతిక ఆధారాలు కీలకంగా మారనున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో జానీ మాస్టర్ భార్యను కూడా విచారించే అవకాశముంది.
Hanu Man | బాహుబలి, ఆర్ఆర్ఆర్ రూట్లో తేజ సజ్జా హనుమాన్.. ప్రశాంత్ వర్మ కొత్త పోస్టర్ వైరల్
C Kalyan | పోక్సో కేసు వర్తిస్తుందా..? జానీ మాస్టర్ వివాదంపై నిర్మాత సీ కల్యాణ్
Prakash Raj | చేయని తప్పుకి సారీ.. హాట్ టాపిక్‌గా ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్